Begin typing your search above and press return to search.

నాగ్ కోసం ఆ ఇద్ద‌రు కూడా వ‌చ్చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   23 Sep 2022 6:01 AM GMT
నాగ్ కోసం ఆ ఇద్ద‌రు కూడా వ‌చ్చేస్తున్నారు!
X
ద‌స‌రా బ‌రిలో ఎన్ని సినిమాలు పోటీప‌డుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కైతే ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు 'ది ఘోస్ట్‌'. కింగ్ నాగార్జున న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సొనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ల‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. అక్టోబ‌ర్ 5న ద‌స‌రా బ‌రిలో హాట్ ఫేవ‌రేట్ గా దిగుతూ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సినిమాలోని కీల‌క పాత్ర‌ల్లో గుల్ ప‌నాగ్‌, అనికా సురేంద్ర‌న్ న‌టించారు.

కింగ్ నాగ్ నుంచి బ్లాస్టింగ్ హిట్ వ‌చ్చి చాలా రోజుల‌వుతోంది. ఈ సారి ఎలాగైనా ఆ స్థాయి బ్లాస్టింగ్ హిట్ ని సొంతం చేసుకోవాల‌నే ఆలోచ‌నలో వున్న నాగార్జున కొత్త పంథాలో తెర‌కెక్కిన యాక్ష‌న్ డ్రామా 'ది ఘోస్ట్‌'ని ఎంచుకున్నారు. ఫ‌స్ట్ లుక్ నుంచి సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తూ వ‌స్తున్న ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌లో మ‌రింత బ‌జ్ ని, క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కోసం నాగ్ కొత్త‌గా క‌త్తి విన్యాసాల్లో భాగంగా క‌రువ‌మ‌గ నేర్చుకున్నారు.

సినిమాకు నాగ్ పై చిత్రీక‌రించిన స్వార్డ్ ఫైట్ కీల‌కంగా మార‌డంతో నాగార్జున ఇందు కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకోవ‌డం విశేషం. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేసేసింది. ఇందులో భాగంగా ఇటీవ‌లే రొమాంటిక్ లిరిక‌ల్ వీడియోని రిలీజ్ చేసిన మేక‌ర్స్ గురువారం 'గ‌న్స్ అండ్ స్వార్డ్స్ యాక్ష‌న్ వీడియో' అంటూ ఓ మేకింగ్ వీడియోని విడుద‌ల చేశారు. గ‌న్స్ షూటింగ్ తో పాటు క‌త్తి ఫైట్ కి సంబంధించిన క‌రువ మ‌గ లో నాగ్ శిక్ష‌ణ‌కు సంబంధించిన విజువ‌ల్స్ ని చూపించారు.

ఇదిలా వుంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ని సెప్టెంబ‌ర్ 25న క‌ర్నూలు లోని STBC గ్రౌండ్ లో భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ భారీ ఈవెంట్ లో కింగ్ నాగార్జున‌తో పాటు ఆయ‌న త‌న‌యులు, హీరోలు అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్ అక్కినేని పాల్గొన‌బోతున్నారు. ముగ్గుర ఒకే స్టేజ్ పై క‌నువిందు చేయ‌బోతుండ‌టంతో అక్కినేని ఫ్యాన్స్ అప్పుడే సెల‌బ్రేష‌న్స్ మోడ్ లోకి వెళ్లిపోయార‌ట‌. చాలా రోజుల త‌రువాత ఈ ముగ్గ‌రూ ఒకే వేదిక‌ని పంచుకుంటుండ‌టం విశేషం.

నారాయ‌ణ్ దాస్ నారంగ్ ఆశీస్సుల‌తో ఈ మూవీని పుస్కూర్ రామ్మోహ‌న్ రావు, నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత శ‌ర‌త్ మ‌రార్ ల‌తో క‌లిసి సునీల్ నారంగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మార్క్ కె. రాబిన్‌, సినిమాటోగ్ర‌ఫీ ముఖేష్ జి, యాక్ష‌న్ దినేష్ సుబ్బ‌రాయ‌న్‌, కేచ, ఆర్ట్ బ్ర‌హ్మ క‌డ‌లి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.