Begin typing your search above and press return to search.

శంక‌ర్ ప్లాన్! చ‌ర‌ణ్ కోసం ముగ్గురు సూప‌ర్ స్టార్లు?

By:  Tupaki Desk   |   21 April 2021 10:00 PM IST
శంక‌ర్ ప్లాన్! చ‌ర‌ణ్ కోసం ముగ్గురు సూప‌ర్ స్టార్లు?
X
శంక‌ర్ -రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో భారీ పాన్ ఇండియా మూవీ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. ఇందులో చ‌ర‌ణ్ యువ ఐఏఎస్ గా న‌టిస్తారు. అలాగే సీఎం పాత్ర‌తోనూ స‌ర్ ప్రైజ్ చేస్తార‌న్న టాక్ వినిపిస్తోంది.

ఆస‌క్తిక‌రంగా ఇదే సినిమాలో మ‌రో కీల‌క పాత్ర కోసం నాలుగు భాష‌ల్లో న‌లుగురు ప్ర‌ముఖ స్టార్ల‌ను ఎంపిక చేస్తున్నార‌ని తెలిసింది. హిందీ వెర్ష‌న్ కోసం స‌ల్మాన్ ని సంప్ర‌దించార‌ని మెగా కాంపౌండ్ తో చ‌ర‌ణ్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా స‌ల్మాన్ అగీక‌రించే వీలుంద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు క‌న్న‌డంలో ఉపేంద్ర లేదా సుదీప్ న‌టిస్తారు. సుదీప్ ఇంత‌కుముందు మెగా కాంపౌండ్ లో న‌టించారు కాబ‌ట్టి అత‌డు వెంట‌నే అంగీక‌రిస్తారు. అలాగే త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి న‌టించే వీలుంది. చిరుతో సైరా.. వైష్ణ‌వ్ తో ఉప్పెన‌లో న‌టించిన సేతుప‌తి ఈ మూవీలో కీల‌క పాత్ర‌కు అంగీక‌రిస్తార‌ని భావిస్తున్నారు.

ఇక తెలుగు వెర్ష‌న్ లో ప‌వ‌న్ లేదా చిరు న‌టించే వీలుంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ చ‌ర‌ణ్ తోనే తెలుగులో ద్విపాత్రాభిన‌యం చేయించినా ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేద‌ని ఊహ‌గానాలు సాగుతున్నాయి. ఇక చెర్రీ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక‌ను ఫైన‌ల్ చేయాల్సి ఉంది. ర‌ష్మిక లేదా కియ‌రా అద్వాణీ ఈ చిత్రంలో న‌టిస్తార‌ని గుస‌గుస‌లు ఇంత‌కుముందు వినిపించాయి. మొత్తానికి చ‌ర‌ణ్ -శంక‌ర్ మూవీ అభిమానుల్లో అంత‌కంత‌కు ఉత్కంఠ‌ను పెంచేస్తోంది. దాదాపు 400కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెర‌కెక్కిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.