Begin typing your search above and press return to search.
ఆ ముగ్గురూ కరోనియల్ మమ్మీస్..!
By: Tupaki Desk | 28 Jan 2021 11:00 PM ISTబెబో కరీనాకపూర్ - సైఫ్ అలీఖాన్ ప్రేమాయణం .. అటుపై పెళ్లి తర్వాత లైఫ్ గురించి తెలిసినదే. ఈ జంటకు థైమూర్ అలీఖాన్ అనే వారసుడు జన్మించాడు. ఆ తర్వాత ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు కరీనా సిద్ధమయ్యారు. ఇటీవలే బేబి బంప్ ఫోటోల్ని కరీనా షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
తాజాగా కరీనా కపూర్ తమ రెండవ బిడ్డను ఫిబ్రవరిలో ప్రసవించనున్నట్లు సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు. గత సంవత్సరం కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో ఈ జంట అధికారికంగా తమ రెండో బిడ్డ గురించి ప్రకటించింది. ఫిబ్రవరి ప్రారంభంలో ఏ క్షణమైనా శిశువు జన్మిస్తుందని సైఫ్ వెల్లడించారు.ప్రఖ్యాత ఫిలింఫేర్ తో మాట్లాడుతూ సైఫ్ అలీ ఖాన్... గత కొన్ని నెలలుగా వారు చాలా ప్రశాంతంగా ఉన్నామని.. అకస్మాత్తుగా శిశువు నా దగ్గరకు వచ్చి హాయ్! చెప్పబోతున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ఇంకొక బిడ్డ జననం అంటే పెద్ద బాధ్యత కాబట్టి కొంచెం భయపడతుననానని కానీ ఇంటివద్ద అల్లరి చేసే చిన్న పిల్లల ఉత్సాహంతో ఏదీ సరిపోలదని అన్నారు.
2020 ఆగస్టులో- కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ తమ రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జంట రెండవ సంతానం కరోనియల్ అవుతుంది. కరోనియల్ అనేది కరోనావైరస్ దిగ్బంధం కాలంలో గర్భం దాల్చిన శిశువులకు ఐడెంటిటీ కోసం సృష్టించిన పదం. లాక్ డౌన్ లోనే పలువురు గర్భాలను ప్రకటించారు. డిసెంబర్ 2020 తరువాత 2021 వసంతకాలం వరకు పుట్టిన వారిని కోవిడ్-పిల్లలు అని కూడా పిలుస్తారు.ఇటీవల జన్మించిన అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ కుమార్తె కూడా కరోనియల్. అలాగే నువ్వు నేను ఫేం అనిత హసనందానీ బేబిబంప్ ప్రదర్శన తెలిసిందే. తనకు జన్మించబోయే బిడ్డను కూడా కరోనియల్ అని అనొచ్చు.