Begin typing your search above and press return to search.

OTT లో వేడి పెంచ‌నున్న ఆ న‌లుగురు!

By:  Tupaki Desk   |   10 Oct 2020 12:30 AM GMT
OTT లో వేడి పెంచ‌నున్న ఆ న‌లుగురు!
X
నిశ్శ‌బ్ధం .. ఒరేయ్ బుజ్జిగా లేటెస్టుగా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీటికి చెప్పుకోద‌గ్గ స్పంద‌న జ‌నం నుంచి రాలేదు. ఆక‌ట్టుకునే కంటెంట్ కాద‌ని పెద‌వి విరిచేశారు. ఇక ఇవి థియేట‌ర్ల‌లో రిలీజైనా ఫ‌లితం ఏమంత మెరుగ్గా ఉండ‌ద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి.

అయితే త‌దుప‌రి రిలీజ్ ల‌లో ఇంకేవి ఆస‌క్తిని పెంచేవి? అంటే.. అందులో కిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న ల‌క్ష్మీ బాంబ్ ... అలాగే స్టార్ హీరో సూర్య న‌టించిన ఆకాశ‌మే నీ హ‌ద్దురా (సుర‌రై పొట్రు).. వ‌రుణ్ ధావ‌న్- సారా అలీఖాన్ జంట‌గా న‌టించిన `కూలీ నంబ‌ర్ 1` చిత్రాల‌పై విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. ఇక వీటితో పాటు మిర్జాపూర్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఈ మూడింటిపైనా జ‌నంలో ఆస‌క్తి నెల‌కొంది. అయితే వీటిలో కూలీ నంబ‌ర్ 1 కాస్త ఆల‌స్యంగానే రిలీజ్ కానుంది.

ఇందులో ల‌క్ష్మీ బాంబ్ తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ కాంచ‌నకు రీమేక్ కావ‌డంతో ఆస‌క్తి నెలకొంది. అక్ష‌య్ పోస్ట‌ర్లు ఆస‌క్తిని పెంచాయి. న‌వంబ‌ర్ 9న ఓటీటీలో ఈ సినిమా భారీగా అంచ‌నాల న‌డుమ‌ రిలీజ్ కానుంది. ఇక సూర్య ఎంతో క‌సిగా న‌టించిన బ‌యోపిక్ చిత్రం కావ‌డంతో ఆకాశ‌మే నీ హ‌ద్దురా సినిమాపైనా అంచ‌నాలున్నాయి. మిర్జాపూర్ ఓటీటీని షేక్ చేసిన సిరీస్. దీంతో ఈ మూడింటి గురించి జ‌నం ఆస‌క్తిగా ఉన్నారు. వీటితో పాటు అటు హాలీవుడ్ సిరీస్ లు స‌హా ప‌లు సినిమాలు ఓటీటీల్ని ముంచెత్త‌నున్నాయి. ఈ మూడు ముఖ్యమైన OTT విడుదలలు వేర్వేరు డిజిటల్ ప్లాట్ ఫామ్ ‌లపై వస్తున్నాయి. ‘లక్ష్మీ బాంబ్’ హాట్ స్టార్ లో ప్ర‌సారం కానుంది. అక్టోబర్ 30 న అమెజాన్ ప్రైమ్‌లో ‘సూరరై పొట్రూ’ విడుద‌ల‌వుతోంది. వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్ 2’ అక్టోబర్ 23 నుండి ప్రసారం కానుంది.