Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీని పునీతం చేసిన ఆ న‌లుగురు లాయ‌ర్లు

By:  Tupaki Desk   |   12 April 2021 3:30 AM GMT
ఇండ‌స్ట్రీని పునీతం చేసిన ఆ న‌లుగురు లాయ‌ర్లు
X
2021లో తెరపైకి వచ్చిన నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో ఒక సాధారణ ఎలిమెంట్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు వ‌చ్చింది. చెక్- నాంది- జాతి రత్నాలు-వ‌కీల్ సాబ్ ఇవ‌న్నీ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వ‌చ్చి విజ‌యాలు అందుకున్నాయి. ఈ నాలుగింటిలో కామ‌న్ గా క‌నిపించే పాత్ర లాయ‌ర్.

ఈ సినిమాలన్నిటా కథానాయకుడు లేదా క‌థానాయిక‌ల్లో ఎవ‌రో ఒక‌రు న్యాయవాది పాత్రను పోషించారు. వకీల్ సాబ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయ‌ర్. ఒక కేసులో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు మహిళల కేసును స్వీకరించే న్యాయవాది పాత్రను పోషించారు. మిగిలిన మూడు చిత్రాలలో న్యాయవాది పాత్రలను క‌థానాయిక‌లు పోషించారు. ఆ ముగ్గురు పురుషుల కేసులను తీసుకుంటారు. యాథృచ్ఛిక‌మే అయినా ఆ ఎలిమెంట్ ఎంతో ఉత్కంఠ‌ను రేపుతోంది. ఈ సినిమాల‌న్నీ విజ‌యాలు సాధించ‌డం అన్న‌ది మ‌రో ట్విస్టు అన్న సెంటిమెంట్ బ‌ల‌ప‌డుతోంది.

నాందిలో వరలక్ష్మి శరత్ కుమార్ నరేష్ కేసును టేక‌ప్ చేస్తారు. చెక్ ‌లో ఉగ్రవాద కేసులో నితిన్ తరపున రకుల్ ప్రీత్ సింగ్ వాదించారు. జాతి రత్నాలులో నవీన్ పోలిశెట్టి అతని ముఠా కేసును ఫరియా అబ్దుల్లా టేక‌ప్ చేశారు. వీరంతా లాయ‌ర్లుగా అద్భుతంగా న‌టించారు. చాలా అరుదుగా ఇలాంటి కోయిన్సిడెన్స్ క‌నిపిస్తుంటుంది. ఈసారి కూడా ఒకే ఎలిమెంట్ తో ఆ నాలుగైదు చిత్రాలు హిట్లు కొట్టి హాట్ టాపిక్ గా మారాయి. ఇంట్రెస్టింగ్.. యూనిక్!