Begin typing your search above and press return to search.

ఆ ఐదు పీసీ లైఫ్ లో వెరీ వెరీ స్పెష‌ల్

By:  Tupaki Desk   |   27 Jun 2021 3:30 AM GMT
ఆ ఐదు పీసీ లైఫ్ లో వెరీ వెరీ స్పెష‌ల్
X
అమెరిక‌న్ గాయ‌కుడు కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా లైఫ్ జ‌ర్నీ అంత‌కంత‌కు ఆస‌క్తిని పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో న‌టిస్తూనే హాలీవుడ్ లో పాపుల‌ర్ స్టార్ గా వెలిగిపోతోంది. మ‌రోవైపు హాలీవుడ్ టు బాలీవుడ్ భారీ వెబ్ సిరీస్ లు సినిమాల నిర్మాణానికి భారీ పెట్టుబ‌డుల‌ను వెద‌జ‌ల్లుతూ త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది.

ఇక‌పోతే భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి ఆద‌ర్శ‌వంత‌మైన ల‌వ్ లైఫ్ ని సంసార జీవ‌నాన్ని లీడ్ చేస్తున్న పీసీ నిరంత‌రం త‌న‌దైన ఫ్యాష‌న్స్ అండ్ స్టైలింగ్ తో అల‌రిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ భామ ఫోటోషూట్ల‌లో అత్యంత వేగంగా వైర‌ల్ అయిన ఐదు ఫోటోల‌ను ప‌రిశీలిస్తే..

ప్రియాంక చోప్రా జోనాస్ హాటెస్ట్ పింక్ బికినీ ఇప్ప‌టికీ టాప్ లో ట్రెండింగ్ ఉంది. ఆ త‌ర్వాత తన కుక్కతో ఫోజులిచ్చిన రీసెంట్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వేగంగా వైర‌ల్ అయ్యింది. బ్లాక్ షేడ్స్ ధరించిన ప్రియాంక చోప్రా జోనాస్ సాధారణ చిత్రం కూడా వైర‌ల్ గా దూసుకెళ్లింది. పీసీ అందమైన న‌వ్వు బీచ్ లో కొంత సమయం గ‌డిపిన మ‌రో ఫోటో అంద‌రినీ ఆక‌ర్షించింది. పీసీ త‌న ల‌గ్జ‌రియ‌స్ కార్ లో వ‌ర్క్ మూడ్ లో ఉన్న ఓ ఫోటో అంతే వేగంగా వైర‌ల్ అయ్యింది. డార్క్ బ్రౌన్ జ‌ర్కిన్ లో ఎంతో అందంగా క‌నిపించింది పీసీ. అలాగే వైన్ గ్లాస్ తో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ లో బిజీగా ఉన్న పీసీ ఫోటో కూడా అంతే వేగంగా వైర‌ల్ అయ్యింది. ఆ ఐదు ఫోటోలు పీసీ లైఫ్ లో వెరీ వెరీ స్పెష‌ల్ అని చెప్పాలి.