Begin typing your search above and press return to search.

అతి తప్పుడు న్యూస్ అంటూ మనోజ్ క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Aug 2021 10:01 PM IST
అతి తప్పుడు న్యూస్ అంటూ మనోజ్ క్లారిటీ
X
మంచు మనోజ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పి బిజినెస్ పెట్టబోతున్నాడు.. తెలుగు రాష్ట్రాల్లో యువతకు ఉపాది కల్పించబోతున్నాడు అంటూ ఒక మీడియా కథనం అల్లింది. ఆ మీడియా కథనంపై సున్నితంగా మంచు మనోజ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సదరు వార్త కథనంకు సోషల్‌ మీడియాలో సమాధానం ఇచ్చాడు. బ్రహ్మానందం కోపంతో చూస్తున్న ఫొటో మరియు దండం పెడుతున్న ఫొటోలను షేర్‌ చేసిన మంచు మనోజ్‌ ఆ వార్తను ఫేక్ న్యూస్ అంటూ తనదైన శైలిలో కొట్టి పారేశాడు. ఆ వార్తలపై వెంటనే మనోజ్‌ స్పందించడంతో ఎక్కువ దూరం వెళ్లకుండానే క్లారిటీ వచ్చేసింది.

ట్విట్టర్ లో మంచు మనోజ్‌.. తప్పుడు న్యూస్ ను ప్రచారం చేయవద్దన్నా.. సమ్మర్ నుండి మన సినిమాలు మొదలు అవ్వబోతున్నాయి. యాక్షన్ అని చెప్పక ముందే కట్‌ చెప్పొద్దు అన్న. తర్వాత ఆర్టికల్‌ అయినా మీ నుండి నాకు సపోర్ట్‌ గా వస్తుందని ఆశిస్తున్నాను అంటూ చాలా సింపుల్ గా రిక్వెస్ట్‌ గా తన సహజ రీతికి విరుద్దంగా ఆ తప్పుడు కథనంను మంచు మనోజ్‌ కొట్టి పారేశాడు. మామూలుగా అయితే మంచు మనోజ్‌ తీవ్రంగా విమర్శలు చేయడం మొదలుకుని వ్యక్తిగతంగా తప్పుడు న్యూస్‌ ను స్పెడ్‌ చేసినందుకు గాను తిట్టేవాడు.

మంచు మనోజ్ తన గురించి తప్పుడు కథనంను చాలా సింపుల్‌ గా ఖండించడం మంచి పరిణామం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సమ్మర్‌ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను మంచు మనోజ్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. పెద్ద ఎత్తున అంచనాలున్న అహం బ్రహ్మాస్మి సినిమా విషయంలో మంచు అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంచు మనోజ్ ఈమద్య కాలంలో వరుసగా పలు కథలకు ఓకే చెప్పాడని వచ్చే ఏడాది నుండి సంవత్సరానికి రెండు మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మంచు మనోజ్ అభిమానులు ఆయన నుండి బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను ఆశిస్తున్నారు.