Begin typing your search above and press return to search.

ఆ 6 సినిమాలు కూడా ఓటీటీలోనే.. నేనేం చేయలేను

By:  Tupaki Desk   |   19 July 2021 2:30 AM GMT
ఆ 6 సినిమాలు కూడా ఓటీటీలోనే.. నేనేం చేయలేను
X
ఒక వైపు తెలుగు సినిమాల బయ్యర్లు మరియు థియేటర్ల యాజమాన్యాలు సినిమాలను ఓటీటీ కి అమ్మవద్దని.. అక్టోబర్‌ వరకు వెయిట్‌ చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. థియేటర్ల మనుగడపై దెబ్బ కొట్టవద్దంటూ నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు థియేటర్ల పునః ప్రారంభంకు ఓకే చెప్పడంతో ఇక పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్ ఉండక పోవచ్చు అంటూ అంతా అనుకుంటూ ఉండగా అనూహ్యంగా సురేష్‌ బాబు నారప్ప మరియు దృశ్యం 2 సినిమా ల ను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇండస్ట్రీ వర్గాల వారు సురేష్‌ బాబుపై విమర్శలు గుప్పించారు.

తనపై వచ్చిన విమర్శలను సున్నితంగా తిప్పి కొట్టే ప్రయత్నంను సురేష్‌ బాబు చేశాడు. ఆయన నారప్ప సినిమా విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ దృశ్యం 2 ను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. కేవలం ఈ రెండు మాత్రమే కాకుండా మొత్తం ఆరు సినిమాలను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా హింట్ ఇచ్చాడు. నారప్ప.. విరాట పర్వం.. దృశ్యం 2 ఇతర సినిమాలకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ కేవలం సమర్పణ మాత్రమే. మేము నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్నారు. కనుక విడుదల విషయంలో మేము నిర్ణయం తీసుకోలేము.

ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ లో తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మాత్రమే సొంతంగా నిర్మాణం అవుతుంది. ఆ సినిమా ఓటీటీ విడుదల ను నేను ఆపగలను. కాని ఇతర బ్యానర్‌ లతో కలిసి నిర్మించిన సినిమాలను నేను ఎలా ఆపగలను అంటూ ఆయన నిర్మొహమాటంగా ఇతర సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ విషయమై హింట్ ఇచ్చాడు. విరాట పర్వం షూటింగ్ బ్యాలన్స్ ఉందన్న ఆయన విడుదల విషయంలో తమ నిర్మాణ భాగస్వామ్యులదే తుది నిర్ణయంగా పేర్కొన్నాడు. ఇంతకు ముందు సురేష్‌ బాబు మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో జనాలను థియేటర్లకు రప్పించడం మంచి నిర్ణయం కాదని కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. సురేష్‌ బాబు తాజా వ్యాఖ్యలతో ఆయనపై మరింతగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.