Begin typing your search above and press return to search.

తొలి ప్రేమ.. అది లాభమా నష్టమా?

By:  Tupaki Desk   |   2 Feb 2018 5:23 AM GMT
తొలి ప్రేమ.. అది లాభమా నష్టమా?
X
ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా కుర్రాడు వరుణ్ తేజ్ నటించిన సినిమా ‘తొలి ప్రేమ’. ‘స్నేహగీతం’ నటుడు వెంకీ అట్లూరి దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా ఇది. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఐతే ఈ నెల 9న రావాల్సిన ‘తొలి ప్రేమ’ను మరో మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ మూవీ ‘ఇంటిలిజెంట్’తో పోటీ ఎందుకని ఒక రోజు ఆలస్యం చేశారు. ఫిబ్రవరి 10న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఐతే తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10న రాబోయే ‘తొలి ప్రేమ’.. అమెరికాలో మాత్రం ముందు అనుకున్నట్లే 8వ తేదీ ప్రిమియర్లతో విడుదల కాబోతోంది. ‘ఇంటిలిజెంట్’పై అమెరికాలో పెద్దగా అంచనాల్లేవు. అక్కడ దానికి ‘తొలి ప్రేమ’కు దానికి పోటీని పట్టించుకోవట్లేదు. ‘తొలి ప్రేమ’ లాంటి క్లాస్ లవ్ స్టోరీలకే అక్కడ ఆదరణ ఎక్కువ. ఈ చిత్రానికి కొంచెం భారీగానే ప్రిమియర్లు ప్లాన్ చేశారు. అందుకే ముందే సినిమాను రిలీజ్ చేసుకునే అడ్వాంటేజీని వదులుకోవాలని చిత్ర బృందం అనుకోవట్లేదు.

తెలుగు రాష్ట్రాల్లో విడుదల కావడానికంటే రెండు రోజుల ముందే అమెరికా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది ‘తొలి ప్రేమ’. కానీ ఇది లాభమా.. నష్టమా అన్నదే సందేహం. సినిమా బాగుండి.. పాజిటివ్ టాక్ వస్తే ఓకే. ఒకవేళ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే మాత్రం ఇబ్బందే. రెండు రోజుల ముందే టాక్ తెలిసిపోతే.. అది తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్స్ మీద కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఏమో.. యుఎస్ ప్రిమియర్ల వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.