Begin typing your search above and press return to search.

ఫస్ట్ వీకెండ్: తొలిప్రేమ సత్తా చాటేసింది

By:  Tupaki Desk   |   12 Feb 2018 6:52 AM GMT
ఫస్ట్ వీకెండ్: తొలిప్రేమ సత్తా చాటేసింది
X
వరుణ్‌ తేజ్ మరోసారి ఫిదా తరువాత తను లవ్ స్టోరీస్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం ప్రూవ్ చేసుకున్నాడు. ఈసారి మనోడు కొత్త కుర్రాడు వెంకీ అట్లూరి డైరక్షన్లో ఒక సినిమాను చేశాడు. ఒకే కుర్రాడికి చెందిన మూడు ఫేజుల ప్రేమకథను ఆహ్లాదకరంగా చెప్పడంతో.. సినిమా అందరికీ నచ్చేసింది. ముఖ్యంగా డేరింగ్ గా ఓవర్సీస్ ప్రీమియర్లు వేసి కూడా.. సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. తెలుగునాట కూడా విజయ డుండుభి మోగిస్తోందీ సినిమా. అదిగో ఆ లెక్కలే అందుకు నిదర్శనం.

తొలిరోజున ఏకంగా 5.12+ కోట్ల షేర్ వసూలు చేసిన ఈ తొలిప్రేమ.. ఆ తరువాత కూడా అదే లెవెల్లో ఇరగదీసింది. అసలు కజిన్ సాయిధరమ్ కోసం శుక్రవారం వదిలేసుకుని.. కేవలం శనివారం మరియు ఆదివారంను మాత్రమే నమ్ముకున్న వరుణ్‌.. వీకెండ్ రెండు రోజులూ కలుపుకుని.. ఏకంగా 9.26 కోట్లు వసూలు చేశాడు ఈ హీరో. కొత్త దర్శకుడి క్యూట్ టేకింగ్.. అలాగే వరుణ్‌ తేజ్ పెర్ఫామెన్స్.. ఇన్నాళ్లూ కేవలం గ్లామర్ మీద ఆధారపడి బికినీలు అంటూ చెలరేగిన రాశి ఖన్నా కూడా తనకు యాక్టింగ్ వచ్చు అని ప్రూవ్ చేసుకోవడం.. ఈ సినిమాకు ప్లస్ అయ్యాయ్. కామెడీ ట్రాక్ కూడా ఫస్టాఫ్‌ ను బాగా నడిపించింది. దానితో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది.

ఏరియాల వారీగా వసూళ్లు

నైజాం - 2.3 కోట్లు
ఉత్తరాంధ్ర - 0.86 కోట్లు
ఈస్ట్ - 0.48 కోట్లు
వెస్ట్ - 0.44 కోట్లు
కృష్ణా - 0.53 కోట్లు
గుంటూరు - 0.62 కోట్లు
నెల్లూరు - 0.23 కోట్లు
సీడెడ్ - 0.73 కోట్లు
నైజాం ప్లస్ ఏపీ - 6.96 కోట్లు
యూఎస్ - 2.30 కోట్లు
రెస్టాఫ్ ఏరియాస్ - 0.75 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్ కలెక్షన్స్ - 9.26 కోట్లు

అయితే సినిమాకు సోమవారం వసూల్ళు ఎలా ఉంటాయి అనే దానిని బట్టి ఈ సినిమా స్థాయి ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. చూస్తుంటే ఒక 30 కోట్లు షేర్ రాబట్టడం పెద్ద కష్టంకాదులే కాని.. ఫిదా తరహాలో 50 కోట్ల షేర్ వస్తుందని మాత్రం ట్రేడ్ పండితులు చెప్పలేకపోతున్నారు. చూద్దాం ఏమవుతుందో!!