Begin typing your search above and press return to search.

తొలిప్రేమ భాగానే రాబట్టిందిగా

By:  Tupaki Desk   |   19 Feb 2018 4:14 PM GMT
తొలిప్రేమ భాగానే రాబట్టిందిగా
X
మెగా హీరోలందరు మంచి హిట్ అందుకుంటున్న సమయంలో ఫెయిల్యూర్స్ తో కాస్త సతమతమైన హీరో వరుణ్ తేజ్. అయితే కరెక్ట్ టైమ్ లో ఫిదా సినిమాతో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ సక్సెస్ ట్రాక్ ను ఈజీగా అందుకున్నాడు. తొలిప్రేమ సినిమాకు ఫిదా చాలా వరకు హెల్ప్ అయ్యింది. పెద్దగా హంగామా చేయకుండా వచ్చినా ఆ సినిమా మొదట టైటిల్ తోనే ఎక్కువగా ఆకర్షించింది. కొత్త దర్శకుడైనా వెంకీ అట్లూరి టేకింగ్ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా కనిపించింది.

సింపుల్ లవ్ స్టోరీగా అందరికి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో కలెక్షన్స్ కూడా సినిమాకు బాగానే వచ్చాయి. మొత్తంగా సినిమా విడుదలైన 9 రోజుల్లో 38.5 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక షేర్స్ పరంగా సినిమా 21కోట్లను రాబట్టింది. ఫిదా తరువాత వరుణ్ కెరీర్ లో ఇదే బెస్ట్ కలెక్షన్స్. వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే మొత్తంగా సినిమా 23 కోట్లకు అమ్ముడుపోయింది. ఇండియాలో రిలీజ్ చేసుకున్న దిల్ రాజుకి మరి ఎక్కువ లాభాలు కాదు గాని గత సినిమాలతో పోల్చుకుంటే బెటర్ అమౌంట్ దక్కింది.

ఇక మొత్తంగా ఏరియాలను బట్టి వరల్డ్ వైడ్ షేర్స్ ఇలా ఉన్నాయి.

నైజాం. 6.20 కోట్లు
వైజాగ్ 2.56 కోట్లు
ఈస్ట్. 1.38 కోట్లు
వెస్ట్ 1.06 కోట్లు
కృష్ణ. 1.24 కోట్లు
గుంటూరు. 1.31కోట్లు
నెల్లూరు 0.50 కోట్లు
సీడెడ్. 9.5కోట్లు
తెలంగాణ+ఆంద్ర 16.2 కోట్లు

యూఎస్. 2.7 కోట్లు
కర్ణాటక. 1.2 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.9 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ - 21 కోట్లు