Begin typing your search above and press return to search.
'బ్యాచ్' తో రాబోతున్న బాల బాహుబలి
By: Tupaki Desk | 24 May 2021 8:00 AM ISTఈమద్య కాలంలో కొత్త గా ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు పరిచయం అవుతున్నారు. అందులో కొందరు బాల నటులుగా కొన్ని సంవత్సరాల ముందే నటించి ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది బాల నటులు హీరోలుగా పరిచయం అవుతున్న ఈ సమయంలో మరో బాల నటుడు సాత్విక్ వర్మ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. బ్యాచ్ అంటూ ఈయన సినిమాను చేశాడు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
సాత్విక్ వర్మ ను చూసిన వెంటనే చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. అందులో మొదటగా బాహుబలి... మళ్లీ రావా.. దువ్వాడ జగన్నాథం ఇంకా కొన్ని ఉన్నయి. ఇతడు ఎక్కువగా హీరోల చిన్నతనం పాత్రలను చేయడం వల్ల పాత్రలు కొద్ది సమయం కనిపించాయి. అయినా కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. కనుక సాత్విక్ వర్మకు హీరోగా చాలా సులభంగానే ఎంట్రీ దక్కింది. బ్యాచ్ తో రాబోతున్న ఈ యువ బాల హీరో మొదటి సినిమా తో సక్సెస్ ను దక్కించుకుని టాలీవుడ్ లో బాల నటుడి మాదిరిగా హీరోగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాడా అనేది చూడాలి.
ఈ సినిమా కు రఘు కుంచె సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తి అయ్యిందని మంచి మాస్ బీట్స్ ను రఘు ఇచ్చాడంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో సాత్విక్ వర్మకు జోడీగా నేహా పఠాన్ హీరోయిన్ గా నటించింది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కొనసాగుతుందని చెబుతున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.