Begin typing your search above and press return to search.

ఈ వారం గెలిచేది ఎవరు ?

By:  Tupaki Desk   |   31 July 2018 2:30 PM GMT
ఈ వారం గెలిచేది ఎవరు ?
X
మరో శుక్రవారం బాక్స్ ఆఫీస్ పోటీకి రెడీ అవుతోంది. గత వారం లాగే ఈసారి కూడా స్టార్లు లేకుండా చిన్న రేంజ్ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది గూఢచారి. తెలుగులో చాలా అరుదుగా వచ్చే స్పై థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. అడవి శేష్ కు హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్ అంటూ లేకపోయినా విభిన్నమైన కథలతో మెప్పిస్తాడనే పేరైతే ఉంది. క్షణం విజయం తర్వాత దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో అడవి శేష్ వరసబెట్టి సినిమాలు చేసేందుకు తొందరపడటం లేదు. ఈ నేపధ్యంలో గూఢచారి మీద మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ లో చూపించిన రేంజ్ లో మెప్పించే కంటెంట్ ఉంటే మాత్రం ఎతో పాటు బిసి సెంటర్స్ ఆడియెన్స్ కూడా ఆదరిస్తారు. శశికిరణ్ తిక్కా టేకింగ్ మీద ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది.

ఇక సుశాంత్ హీరోగా రూపొందిన చిలసౌ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో 24 గంటల్లో జరిగిన ప్రేమ కథగా బాగానే ప్రమోట్ చేస్తున్నారు. దర్శకుడు నటుడు రాహుల్ రవీంద్రన్ డెబ్యూ మూవీగా దీనికి అన్నపూర్ణ సంస్థ అండదండలు ఉండటం హైప్ పరంగా ప్లస్ అవుతోంది. మారుతీ నిర్మించిన బ్రాండ్ బాబు దర్శకుడు ప్రభాకర్ పేరు మీద కంటే మారుతీ బ్రాండ్ మీదే జనంలోకి వెళ్ళిపోతోంది. ఒక డబ్బున్నవాడికి ఓ పనిమనిషికి జరిగే లవ్ స్టోరీగా దీన్ని పూర్తి ఎంటర్ టైన్మెంట్ జానర్ లో తీసారని ట్రైలర్ ని బట్టి అర్థమైపోతోంది. కాకపోతే ఇది మాస్ ని మెప్పించడం గురించి చెప్పలేం కానీ టార్గెట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం ఏ సెంటర్స్ లో రెస్పాన్స్ బాగా వచ్చే అవకాసహం ఉంది.

ఈ మూడింటిలో బాగా ఆడితే లాభ పడే సినిమాగా గూఢచారి కనిపిస్తుండగా దాని తర్వాత స్థానంలో చిలసౌ నిలుస్తోంది. బ్రాండ్ బాబు సర్ ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. సుమంత్ శైలేంద్ర హీరోగా ఎవరికి తెలియని మొహం కాబట్టి థర్డ్ ప్లేస్ తీసుకుంది. మొత్తానికి చిన్న సినిమాల రేస్ లో ఎవరు గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.