Begin typing your search above and press return to search.

వీకెండ్ వార్: చిన్న సినిమాల పెద్ద పోరు

By:  Tupaki Desk   |   18 July 2018 7:22 AM GMT
వీకెండ్ వార్: చిన్న సినిమాల పెద్ద పోరు
X
గత కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న బాక్స్ ఆఫీస్ కి ఆరెక్స్ 100 కొత్త ఎనర్జీని ఇచ్చింది. అంచనాలు ఉన్న విజేత-చినబాబు తేడా కొడితే అసలు హైప్ లేకుండా వచ్చిన ఆరెక్స్ 100 మూడు రోజుల్లోనే పెట్టుబడి వెనక్కు ఇవ్వడం సంచలనం రేపింది. యూత్ ప్రేక్షకుల అండదండలతో దాని జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సినిమా ప్రేమికుల దృష్టి ఎల్లుండి శుక్రవారం మీద ఉంది. రెండు రోజుల్లో నాలుగు సినిమాలు పలకరించబోతున్నాయి. కాకపోతే అన్ని లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న మీడియం ప్లస్ బడ్జెట్ మూవీస్ కావడం విశేషం.

అన్నింటి కన్నా కాస్త పెద్దగా కనిపిస్తున్న విడుదల మాత్రం లవర్ దే. దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన లవర్ మీద భారీ హైప్ లేదు కానీ ఓ మోస్తరు అంచనాలు అయితే ఉన్నాయి. ట్రైలర్ కన్నా ఆడియో పెద్ద హిట్ కావడం అసలు ట్విస్ట్. ఫిదా తరహాలో తక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్న దిల్ రాజు ఇది కూడా అదే కోవలో సూపర్ హిట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు.

ఇక మంచు లక్ష్మి టైటిల్ రోల్ పోషించిన వైఫ్ అఫ్ రామ్ కూడా థియేటర్లలోకి అడుగు పెడుతోంది. విజయ్ ఎలకంటి దర్శకత్వం వహించిన ఈ థ్రిలర్ మీద యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. రెగ్యులర్ మూవీ కాదు కనక మెప్పిస్తుందనే ధీమాలో ఉన్నారు. ట్రైలర్ కూడా ఆసక్తి రేపెలా ఉండటం కొంతవరకు హెల్ప్ అవుతోంది. ఇక ఆటగదరా శివ చాలా భిన్నమైన నేపధ్యంతో వస్తోంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి తలారికి మధ్య ఆసక్తికరమైన సంఘటనలతో రూపొందిన ఈ మూవీ ఓ కన్నడ సూపర్ హిట్ కు రీమేక్. ఇది టాక్ ను బట్టి ఊపందుకునే అవకాశాల మీద విజయం ఆధారపడి ఉంది.

ఇక ఒకరోజు ఆలస్యంగా 21న వస్తున్న పరిచయం సెన్సిబుల్ ప్రేమకథ గా ప్రమోట్ చేస్తున్నారు. దర్శకుడు లక్ష్మి కాంత్ ఇటీవలే ప్రెస్ మీట్ లో మా సినిమాలో బట్టలు విప్పే ప్రేమ ఉండదు అని చెప్పడం సంచలనం రేపింది. నిజమైన ప్రేమ మాత్రమే ఇందులో ఉంటుందని చెప్పడం యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నమే. మరి నాలుగు చిన్న సినిమాలు చేస్తున్న పెద్ద యుద్ధంలో విన్నర్ గా ఎవరు ఉండబోతున్నారు అనేది మరో మూడో రోజుల్లో తేలిపోతుంది. అప్పటి దాకా ఆరెక్స్ 100 జోరుకి బ్రేకులు లేనట్టే.