Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ వార్ వాషీ వ‌ర్సెస్ స‌మ్మ‌త‌మే!

By:  Tupaki Desk   |   13 July 2022 2:01 PM GMT
ఈ వారం ఓటీటీ వార్ వాషీ వ‌ర్సెస్ స‌మ్మ‌త‌మే!
X
ఎప్ప‌టిలాగే ఈ వారం కూడా సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో ఓటీటీల్లో సంద‌డి మొద‌లు కాబోతోంది. అయితే ఇందులో సినిమాటు, వెబ్ వెబ్ సిరీస్ టు స‌మాంగా వుండ‌టం గ‌మ‌నార్హం. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయినా సినిమాల‌తో పాటు థియేట‌ర్ల‌కు రాలేని సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో కీర్తి సురేష్ న‌టించిన‌ `వాషీ`తో పాటు ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో రిలీజైన‌ కిర‌ణ్ అబ్బ‌వ‌రం `స‌మ్మ‌త‌మే` కూడా స్ట్రీమింగ్ కి సిద్ధ‌మైంది.

అంతే కాకుండా అక్కినేని క్యాంప్ నుంచి డైరెక్ట్ ఓటీటీ వ‌రల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సుశాంత్ వెబ్ సిరీస్ `మా నీళ్ల ట్యాంక్‌`కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వారం మొత్తం నాలుగు సినిమాలు, నాలుగు వెబ్ సిరీస్ లు వివిధ పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌లో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. ఇందులో ముందుగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రి జంట‌గా న‌టించిన `స‌మ్మ‌త‌మే`జూలై 15న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది.

ఇక జూలై 17న కీర్తి సురేష్ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `వాషీ` నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. `మిన్నాల్‌ ముర‌ళి` ఫేమ్ టివినో థామ‌స్ తో తొలిసారి క‌లిసి కీర్తిసురేష్ న‌టించిన కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. కీర్తి సురేష్ కెరీర్ లోనే అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని విష్ణు జి రాఘ‌వ్ రూపొందించారు.

ఇక హీరో సుశాంత్ న‌టించిన తొలి వెబ్ సిరీస్ `మా నీళ్ల ట్యాంక్‌`కూడా జూలై 15న ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రియా ఆనంద్ ఇందులో హీరోయిన్ గా న‌టించింది. త‌న‌కు ఇదే తొలి వెబ్ సిరీస్‌. సుద‌ర్శ‌న్‌, బిగ్ బాస్ ఫేమ్ దివి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఇదే రోజు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి న‌టించిన త‌మిళ చిత్రం `మా మానిత‌న్‌` ఆహా లో స్ట్రీమింగ్ కాబోతోంది. జితేంద్ర కుమార్ న‌టించిన `జాదూగ‌ర్‌` నెట్ ఫ్లిక్స్ లో జూలై 15న స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో `శూర్ వీర్‌`, నుస్ర‌త్ బారుచా న‌టించిన `జాన్ హిత్ మిన్జారీ` జీ5లో , కామిక్ స్టార్స్ సీజ‌న్ 3 అమెజాన్ ప్రైమ్ లో జూలై 15న స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి.