Begin typing your search above and press return to search.
ఈ వారం ఓటీటీ టాప్ లిస్ట్
By: Tupaki Desk | 2 Jun 2023 2:45 PMప్రతి వారం లాగానే ఈ వారం కూడా డిజిటల్ కంటెంట్ నెటిజన్ల ను అలరించబోతోంది. సినిమాలు, వెబ్ ఫిల్మ్‌లు వివిధ ప్లాట్‌ఫారమ్ లలో విడుదల అయ్యాయి.. ఇప్పుడు, ఆన్‌లైన్లో విడుదల అయిన సినిమాల జాబితా చూద్దాం.
ఉగ్రం..
కామెడీ పాత్రల కు కేరాఫ్ గా మారిన అల్లరి నరేష్ సీరియస్ రోల్స్‌లోనూ అదరగొడుతున్నాడు. అలా ఇటీవల ఉగ్రం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాంది తో అల్లరోడి కి మర్చిపోలేని హిట్ ఇచ్చిన విజయ్‌కనకమేడల ఈ యాక్షన్ ఎంటర్‌టైన్ కు దర్శకత్వం అందించారు. మిర్నా హీరోయిన్ గా నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఉగ్రం మే 5న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్ల లో అలరించిన ఉగ్రం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అల్లరి నరేష్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.మే 1న అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో ఉగ్రం స్ట్రీమింగ్ అవుతోంది.
పొన్నియిన్ సెల్వన్ 2...
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక యాక్షన్ చిత్రం పొన్నియిన్ సెల్వన్. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్-2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్ కు అందుబాటు లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ సినిమా ను ఇక పై అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరూ ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ముంబైకర్...
కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ సేతుపతి నటించిన తొలి హిందీ చిత్రం.. ముంబైకర్. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేల కు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయింది. జూన్ 2 నుంచి జియో సినిమా లో ఉచితంగా చూడొచ్చు. సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.
భూ..
విష్వక్ సేన్ హీరో గా విజయ్ తెరకెక్కించిన హారర్ చిత్రం భూ. జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్ తదితరులు కథానాయికలు. ఈ సినిమా నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.