Begin typing your search above and press return to search.

ఓటీటీ ద్వారా ఈ వారం సందడి చేయబోతున్నది వీళ్లే

By:  Tupaki Desk   |   26 Oct 2022 2:30 AM GMT
ఓటీటీ ద్వారా ఈ వారం సందడి చేయబోతున్నది వీళ్లే
X
తెలుగు ప్రేక్షకులను సినిమాలు ప్రతి శుక్రవారం వెండి తెర ద్వారా ఏ విధంగా అయితే ఎంటర్ టైన్‌ చేస్తున్నాయో అదే విధంగా ఓటీటీ ద్వారా వచ్చే కంటెంట్‌ ప్రేక్షకులను వారం మొత్తం కూడా ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ప్రతి శుక్రవారం ఓటీటీల వద్ద సందడి కళకళగా ఉంటుంది.

ప్రతి వారం మాదిరిగానే ఈ శుక్రవారం కూడా ఇప్పటికే థియేటర్ ద్వారా విడుదల అయిన సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు డైరెక్ట్‌ రిలీజ్ సినిమాలు వివిధ భాషల ప్రేక్షకులను మరియు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఝాన్సీ సిరీస్‌ ను ఈ వారంలో డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను సిద్ధంగా ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 లో ఝాన్సీ సిరీస్ ను ప్రమోట్ చేయడం కోసం అంజలి స్టార్‌ మా ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలు పెంచిన విషయం తెల్సిందే.

ఝాన్సీ తో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ది ఘోస్ట్‌. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. పైగా గాడ్‌ ఫాదర్ ఉండటం వల్ల ఈ సినిమా యొక్క కలెక్షన్స్ చాలా తక్కువ నమోదు అయ్యాయి.

ది ఘోస్ట్‌ సినిమా ను చూడాలని చాలా మంది ఓటీటీ ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు. ఈ రెండింటితో పాటు ఇంకా కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌ లతో పాటు హిందీ సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా రాబోతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.