Begin typing your search above and press return to search.

ఈసారి మెగాస్టార్ ని ఇబ్బంది పెట్టిన ప్రభాస్

By:  Tupaki Desk   |   21 Feb 2022 10:30 AM GMT
ఈసారి మెగాస్టార్ ని ఇబ్బంది పెట్టిన ప్రభాస్
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడటం జరుగుతుంది. బాహుబలి తో పాన్ ఇండియా సూపర్ స్టార్‌ గా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా లార్జర్‌ దెన్ లైఫ్ అన్నట్లుగా ఉండబోతున్నాయి. అతి త్వరలో ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమా కాకుంగా ఇంకా పలు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి.

ఇటీవలే నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభం అయ్యింది. ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్‌ ఇంకా ఇతర నటీ నటులు షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ ఏ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్నా కూడా అక్కడ తన ఇంటి ఫుడ్‌ రావాల్సిందే. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా కుక్‌ ఉంటారు. ప్రభాస్ కోసమే కాకుండా షూటింగ్‌ లో పాల్గొనే వారి కోసం కూడా ఫుడ్‌ ఉంటుంది.

తాజాగా ప్రభాస్ ఇంటి ఫుడ్ ను బాలీవుడ్‌ బిగ్‌ బి.. మెగాస్టార్‌ అమితాబచ్చన్ టేస్ట్‌ చేశారట. ప్రభాస్‌ చేతి తో వండించిన వంట గురించి అమితాబచ్చన్‌ ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్ ప్రభాస్‌ యొక్క వంటల గురించి.. ఆయన మర్యాద గురించి సోషల్‌ మీడియా ద్వారా.. డైరెక్ట్‌ గా చెప్పుకొచ్చారు. ఆయన ఇంటి నుండి వచ్చే వంటలు డైటింగ్ లో ఉన్న వారిని ఇబ్బంది పెడతాయని.. వాడి డైటింగ్‌ ను చెడగొడుతాయనే టాక్‌ ఉంది.

ఇప్పుడు అమితాబచ్చన్‌ కూడా ప్రభాస్ ఇంటి పుడ్‌ ను ఇష్టంగా తిన్నాడట. సుదీర్ఘ కాలంగా అమితాబచ్చన్‌ ఆహార నియమాలు పాటిస్తూ వస్తున్నారు. ఆయన ఆరోగ్య రహస్యం ఖచ్చితంగా ఆయన ఆహార నియమాలు అంటూ ఉంటారు. అలాంటి ఆహార నియమాలు పాటించే మెగాస్టార్‌ చేత కూడా ప్రభాస్ ఆయనకు ఇష్టమైనవి తినిపించారట. ప్రభాస్ ఆతిధ్యానికి అమితాబచ్చన్ ముచ్చట పడ్డారు.

అంతకు ముందు చిన్నవాడు అయినా కూడా ప్రభాస్ నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అన్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభాస్ మరియు అమితాబచ్చన్ లు ఒకరి గురించి ఒకరు చేసుకున్న సోషల్‌ మీడియా పోస్ట్‌ లు గత రెండు మూడు రోజులుగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ సమయంలో ప్రభాస్ యొక్క ఆతిథ్యం గురించి బిగ్‌ బి చెప్పుకొచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.

ప్రభాస్ మరియు అమితాబచ్చన్ ల యొక్క కాంబో సినిమా ప్రాజెక్ట్ కే కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అశ్వినీదత్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మెగా మూవీ పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఇది కేవలం పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్‌ వరల్డ్‌ మూవీ అంటూ ఇప్పటికే దర్శకుడు అంచనాలు పెంచాడు. వచ్చే ఏడాదిలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ కథతో రూపొందుతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.