Begin typing your search above and press return to search.

ప్రిన్సెస్ కి నెల‌ల పాటు నిదురే క‌రువు

By:  Tupaki Desk   |   17 March 2019 4:11 PM GMT
ప్రిన్సెస్ కి నెల‌ల పాటు నిదురే క‌రువు
X
2019-20 సీజ‌న్ టాప్ మ‌ల్టీస్టార‌ర్ల‌లో అవ‌కాశాలు అందుకుంది ఆలియా భ‌ట్. ఈ అమ్మ‌డు న‌టిస్తున్న సినిమాలన్నీ అసాధార‌ణ బ‌డ్జెట్లు, టాప్ కాస్టింగ్ తో తెర‌కెక్కుతున్న భారీ మ‌ల్టీస్టారర్లే కావ‌డం ఆస‌క్తిక‌రం. సాటి క‌థానాయిక‌ల‌తో పోలిస్తే ఆలియా క్రేజు అమాంతం స్కైలోకి దూసుకెళుతోంది. బాలీవుడ్ లో దీపిక ప‌దుకొనే త‌ర్వాత అంత‌టి రైజింగ్ స్టార్ గా ఎదిగేస్తున్న ఈ కుర్ర బ్యూటీ ప్ర‌స్తుతం టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే.

`బాహుబ‌లి` ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఏరికోరి మ‌రీ ఈ అంద‌గ‌త్తెను ఆర్.ఆర్.ఆర్ కోసం ఎంపిక చేసుకున్నాడు. ఈ చిత్రంలో సీత పాత్ర‌లో న‌టించ‌నుంది. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు (చ‌ర‌ణ్‌) స‌ర‌స‌న‌ ఆలియా (సీత‌) క‌నిపించ‌నుంది. ఈ ఆఫ‌ర్ త‌న‌ను వ‌రించిన సంద‌ర్భంగా జ‌క్క‌న్న‌కు ఎంతో ఎగ్జ‌యిట్ మెంట్ న‌డుమ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. అదంతా స‌రే.. ఆలియా న‌టిస్తున్న ఇత‌ర మ‌ల్టీస్టార‌ర్ల సంగ‌తేంటి? అంటే.. ఈ అమ్మ‌డు న‌టిస్తున్న మ‌రో క్రేజీ సినిమా క‌ళాంక్. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ ఇత‌ర భారీ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రమిది. ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో రూప్ అనే రాకుమారి పాత్ర‌లో ఆలియా న‌టిస్తోంది. త‌న చుట్టూ ఎంద‌రు భారీ తారాగ‌ణం ఉన్నా ఆలియా ముందు దిగ‌దుడుపే అన్నంత అందంగా క‌నిపిస్తోంది. మాధురి ధీక్షిత్ లాంటి సీనియ‌ర్ తార‌తో క‌లిసి ఈ చిత్రంలో నటిస్తోంది ఆలియా. అలాగే రూప్ అంద‌చందాల్ని ఎలివేట్ చేసే పోస్ట‌ర్ ఇదివ‌ర‌కూ రిలీజై కుర్ర‌కారు మ‌న‌సు దోచింది. ఇక‌పై ఓ పాట‌ను తొంద‌ర్లోనే లాంచ్ చేయ‌బోతున్నార‌ట‌. ఆ పాట కోసం ఆలియా ఎంతో శ్ర‌మించింద‌ట‌. రోజులు.. నెల‌ల పాటు షూటింగ్ లో త‌న‌కు నిదురే క‌రువ‌య్యేలా చేసిన ఆ పాట ఔట్ పుట్ చూసుకోవాల‌ని ఆలియా త‌హ‌త‌హ‌లాడుతోంది. ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉంద‌ని చెబుతోంది. మొత్తానికి క‌ళాంక్ తెలుగు వెర్ష‌న్ ని క‌ర‌ణ్ జోహార్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. దీంతో పాటే బ్ర‌హాస్త్ర‌లోనూ ఆలియా పాత్ర ఎంతో ఇంపార్టెంట్ అని అర్థ‌మ‌వుతోంది. ఓవ‌రాల్ గా తెలుగు ఆడియెన్ కి ఈ బ్యూటీ క‌నెక్ట‌యిపోవ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది.