Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఈ సంక్రాంతి ప‌క్కా లిప్ లాక్ ఫెస్టివ‌ల్

By:  Tupaki Desk   |   11 Jan 2022 7:30 AM GMT
టాప్ స్టోరి: ఈ సంక్రాంతి ప‌క్కా లిప్ లాక్ ఫెస్టివ‌ల్
X
లిప్ లాక్ లు వేయడంలో అమీర్ ఖాన్- క‌మ‌ల్ హాస‌న్- ఇమ్రాన్ హ‌స్మి లాంటి స్టార్ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపించేవి. ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి యువ‌హీరో అందాల నాయిక‌ల‌తో లిప్ కిస్సుల కోసం వెంప‌ర్లాడిపోవ‌డం తెర‌పై చూస్తున్నాం. యువ నాయిక‌లు సైతం లిప్ లాక్ ల‌కు త‌గ్గేదేలే! అంటూ కంఫ‌ర్టుగా ఫీల‌వుతున్నారు.

ఈ సంక్రాంతి బ‌రిలో ఇరువురు డెబ్యూ హీరోలు అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు సోద‌రుని కుమారుడు ఆశిష్ - రౌడీ బోయ్స్ చిత్రంతో ల‌క్ చెక్ చేసుకోబోతుంటే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ - హీరో చిత్రంతో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఇద్ద‌రు హీరోలు వెండితెర‌పై లిప్ లాక్ ల‌తో చెల‌రేగిపోవ‌డం క‌నిపిస్తోంది. ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైల‌ర్స్ లో ఇద్ద‌రు హీరోలు క‌థానాయిక‌ల‌తో లిప్ లాక్ లు వేస్తూ చెల‌రేగిపోయారు. అనుప‌మ‌తో డీప్ లిప్ లాక్ లాగించేస్తూ ఆశిష్ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా.. ఇటు త‌న హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ తో ఘాటైన చుంబ‌నంతో అశోక్ గ‌ల్లా కూడా అంతే చెల‌రేగిపోయాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

మహేష్ బాబు మేనల్లుడు.. ఆయన అక్క కొడుకు అశోక్ గల్లా తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ నిజానికి ఈ యువ హీరోతో లిప్ వేయడంతో `హీరో` ట్రైలర్ యూత్ దృష్టిని ఆకర్షించింది.

ఈ సంక్రాంతి పెదవి ముద్దుల సీజన్ గా మారింది అంటూ క‌వులు కూడా చెల‌రేగిపోతున్నారు. కొత్త సినిమాల ట్రైలర్ లు కనీసం ఒక్క ముద్దు సన్నివేశాన్ని అయినా క‌లిగి ఉండ‌డంతో ఫెస్టివ‌ల్ మూడ్ క‌నిపిస్తోంది. ఇంత‌కుముందు కృతి శెట్టితో సింగ‌రాయ్ నాని లిప్ లాక్ కూడా అంతే సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. కొత్త‌మ్మాయి అయినా కృతి ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌లేదు. అలాగే DJ టిల్లు కోసం సిద్ధు జొన్నలగడ్డతో కలిసి హాటీ నేహా శెట్టి లిప్ లాక్ వేసిన ఫోటోలు అంతే వైర‌ల్ గా మారాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి బ‌రినుంచి వైదొలిగింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఎలాగైనా పాపులర్ హీరోయిన్ నుండి లిప్ కిస్ లు కొట్టేస్తున్న యువ‌హీరోల‌ను చూసి సీనియ‌ర్లు కూడా జెల‌సీ ఫీల‌య్యే ప‌రిస్థితి నెల‌కొంది.