Begin typing your search above and press return to search.

ఈ మిస్ వ‌ర‌ల్డ్ శాప‌గ్ర‌స్తురాలు

By:  Tupaki Desk   |   30 Sep 2019 5:27 AM GMT
ఈ మిస్ వ‌ర‌ల్డ్ శాప‌గ్ర‌స్తురాలు
X
కొంత మందికి అందం లేకున్నా అవ‌కాశాలు మాత్రం వెతుక్కుంటూ వ‌స్తుంటాయి. మ‌రి కొంత మందికి మాత్రం అందం ప్ర‌తిభ‌ వున్నా అవ‌కాశాలు ఎంత ప్ర‌య‌త్నించినా ముఖం చాటేస్తుంటాయి. ఇలాంటి ప‌రిస్థితినే విశ్వ‌సుంద‌రి కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషీ చిల్ల‌ర్ ఎదుర్కొంటోంది. 2017లో మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకున్న మానుషీ చిల్ల‌ర్ ఇండియా నుంచి ఆ ఘ‌న‌త‌ను సాధించిన ఆర‌వ మ‌హిళగా రికార్డుల్లో నిలిచింది. మిల్ వ‌ర‌ల్డ్ గా కిరీటాన్ని సొంతం చేసుకుని రెండేళ్లు దాటినా బాలీవుడ్ లో మాత్రం పాగా వేయ‌లేక‌పోయింది.

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెల‌గాల‌ని.. స్టార్ హీరో సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలే చేసింది. కానీ స‌క్సెస్ మాత్రం కాలేక‌పోయింది. ఈ క్ర‌మంలో బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ అమీర్ ఖాన్‌.. స‌ల్మాన్‌.. షారుఖ్‌ ఖాన్ లాంటి స్టార్ హీరోల‌ని బుట్ట‌లో వేసి అవ‌కాశాలు కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ మానుషీ ప‌ప్పులేమీ వాళ్ల ద‌గ్గ‌ర ఉడ‌క‌లేదు. మ‌నూషీ గాలానికి ఏ స్టార్ హీరో లొంగ‌లేదు. చివ‌రికి కుర్ర హీరోలు కూడా మానుషికి ముఖం చాటేశారు. దాంతో బాలీవుడ్ తెర‌పై ఎంట్రీ ఇవ్వ‌లేక‌పోయింది.

మోడ‌ల్ గా వుంటూనే బాలీవుడ్ అవ‌కాశాల కోసం స్పైసీగా ఫొటో షూట్‌ లు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇంత‌కుముందు స‌భ్య‌సాచి వెడ్డింగ్ ఫోటోషూట్ తో వేడి పెంచినా మానుషికి ఎందుక‌నో ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఏంటీ శాపం కొంద‌రికి ఇంతేనా?. ఎంత చేసినా వారి ఆశ‌లు నెర‌వేర‌వా? మానుషీ చిల్ల‌ర్ మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని గెల్చుకున్న శాప గ్ర‌స్తురాలేనా? ఆమె విష‌యంలోనే ఎందుకిలా జ‌రిగింది? సుశ్మితాసేన్- ప్రియాంక చోప్రా- ఐశ్వ‌ర్యారాయ్- డ‌యానా హెడెన్- కంగ‌న .. వీళ్లంతా అందాల పోటీల్లో పాపులరై వెండితెర‌పై వెలిగిన నాయిక‌లు. వాళ్ల‌తో పోలిస్తే మానుషి ఎందుకిలా తేలిపోయింది?