Begin typing your search above and press return to search.
భాయ్ కి పెళ్లయితే ఇలా అయ్యేదే!!
By: Tupaki Desk | 9 Jan 2021 4:15 PM ISTటీమిండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విరాట్ కోహ్లీ .. బాలీవుడ్ అందాల నాయిక అనుష్క శర్మకు లాక్ అయ్యాడు. పెళ్లయ్యాక అలా అయ్యింది. ఇప్పుడు బేబి బంప్ ప్రదర్శన తెలిసిన వ్యవహారమే. ఇటీవల లాక్ డౌన్ సీజన్ లో యువహీరోలు రానా- నితిన్- నిఖిల్ తమకు నచ్చిన వనితల్ని పెళ్లాడేసారు. అంతెందుకు కోహ్లీ కొలీగ్ యజ్వేందర్ చాహల్ కూడా తాను వలచిన సఖిని పెళ్లాడి లైఫ్ లో సెటిలయ్యాడు.
కానీ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ మాత్రం ఎందుకనో ఇంకా పెళ్లాడడం లేదు. భాయ్ కి పెళ్లయిపోతోంది! అన్న పుకార్లు తప్ప ఏదీ లేదు. లులియా వాంటూర్ .. కత్రినల్లో ఎవరో ఒకరిని పెళ్లాడతాడని భావిస్తే అవేవీ నిజాలు కాలేదు. వారంతా ఎవరికి వారు సోలోగానే ఉన్నారు. ఇక దబాంగ్ కోస్టార్ సోనాక్షిని గనుక భాయ్ పెళ్లాడితే ఎలా ఉంటుంది? అన్నది ఊహిస్తూ ఆయన వీరాభిమాని ఒక అద్భుత ఛాయాచిత్రాన్నే డిజైన్ చేశాడిలా.
దబాంగ్ లో జంటగా నటించిన సల్మాన్ ఖాన్ - సోనాక్షిలను జంటగా ఊహించుకుని ఆయన తయారు చేస్తున్న ఈ పోస్టర్లు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఇది ఎన్నటికీ నిజం కాదు కానీ.. నిజమైతే ఎంత బావుంటుందో కదా! అన్న చర్చా మొదలైంది. భాయ్ కి పెళ్లయితే ఇలా అయ్యేదే! అంటూ సోనాక్షి బేబి బంప్ ని అంతే జోరుగా వైరల్ చేస్తున్నారు కొంటె అభిమానులు. అన్నట్టు డార్లింగ్ ప్రభాస్ కూడా బెట్టు వీడి ఒక మెట్టు దిగి వచ్చి పెళ్లాడేస్తాడేమో చూడాలి.