Begin typing your search above and press return to search.

ఎగ్జిక్యూషన్ లో దెబ్బేసింది అంటున్న రౌడీ!

By:  Tupaki Desk   |   28 April 2020 4:00 PM IST
ఎగ్జిక్యూషన్ లో దెబ్బేసింది అంటున్న రౌడీ!
X
అన్నీ సినిమాలు ఆశించిన విజయం సాధించవు. ఎక్కువ శాతం సినిమాలు నిరాశపరుస్తాయి. అయితే అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ఫిలింమేకర్లకు షాక్ తగులుతుంది. యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు 'డియర్ కామ్రేడ్'.. 'వరల్డ్ ఫేమస్ లవర్' రెండూ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఈ సినిమాల విషయంలో ఏం జరిగిందనేది విశ్లేషించాడు.

కథ పేపర్ పై ఉండడం వేరు.. తెరపైకి తీసుకురావడం వేరు. 'డియర్ కామ్రేడ్' లాంటి సినిమాకు జనాలు రెడీగా లేరు. ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్' కథ అది పేపర్ పై గొప్పగా అనిపించింది కానీ మా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది అన్నాడు. మరి రౌడీగారి విశ్లేషణ ఎంతమందికి నచ్చుతుందో.. ఎంత మంది ఒప్పుకుంటారో పక్కన పెడితే రెండు సినిమాలకు ప్రేక్షకుల నుండి తిరస్కరణ ఎదురైందన్నది నిజం. మరొక విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల విషయంలో రౌడీగారు స్క్రిప్ట్ విషయంలో వేలు పెట్టారని అందుకే అసలు కథలు మారిపోయాయని.. 'అర్జున్ రెడ్డి' ఫ్లేవర్ వచ్చిందని కూడా గుసగుసలు కూడా ఉన్నాయి. అయితే విజయ్ ఈ 'వేలు' గురించి మాట్లాడలేదు.

ఇక విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత పూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం.. ప్యాన్ ఇండియా స్కేల్ లో రిలీజ్ కానుండడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు.