Begin typing your search above and press return to search.

సాయి పల్లవి క్రేజ్ అంటే ఇది!

By:  Tupaki Desk   |   6 Jun 2022 6:36 AM GMT
సాయి పల్లవి క్రేజ్ అంటే ఇది!
X
ప్రస్తుత కాలంలో హీరోయిన్ గా సక్సెస్ కావాలి అంటే గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండాలి అని చాలామంది సోషల్ మీడియాలో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాప్ హీరోయిన్స్ కూడా అలానే కొనసాగుతూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రమే గ్లామర్ తో కాకుండా వారి నటన టాలెంట్ తో అగ్రహీరోయిన్ గా కొనసాగుతున్నారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అలా ఆ విధంగా మంచి క్రేజ్ అందుకుంటున్న వారిలో సాయి పల్లవి టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి.

సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో కూడా ఒక మంచి నమ్మకం అయితే ఏర్పడింది. అయితే సాయి పల్లవి నుంచి రాబోతున్న విరాటపర్వం సినిమాకు మొన్నటి వరకు పెద్దగా హైప్ అయితే లేదు. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

సినిమా బాగోలేదు అని రీషూట్స్ జరిగాయని.. అలాగే ఓటీటీలో విడుదల చేయబోతున్నారు అని కూడా అన్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

ఇక నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడంతో సాయి పల్లవి క్రేజ్ కూడా తగ్గిపోయిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదల అయిందో ఒక్కసారిగా ఈ సినిమా పై ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

సమంతతో పాటు చాలామంది హీరోయిన్స్ కూడా విరాటపర్వంలో సాయి పల్లవి నటన చూసి ఫిదా అవుతున్నారు. సినిమాలో మంచి కవిత్వం ఉంది అనే ఫీలింగ్ అయితే కలుగుతోంది. ట్రైలర్ లో సాయిపల్లవి చూపించిన హావభావాలు ఎమోషన్స్ ఓ వర్గం ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి.

తప్పకుండా ఈ సినిమా కు సాయి పల్లవి ఫ్యాన్స్ నుంచి గట్టిగానే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా విరాటపర్వం సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి సాయి పల్లవి క్రేజ్ మరోసారి ఉపయోగపడింది. ఇక జూన్ 17న విడుదలయ్యే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.