Begin typing your search above and press return to search.
పవన్ మూవీకి త్రివిక్రమ్ తెర వెనుక ఉండటంకు కారణం ఇదేనేమో
By: Tupaki Desk | 1 Jan 2021 1:15 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని మించి ఉంటాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన అజ్ఞాతవాసి సినిమా నిరాశ పర్చింది. అయినా కూడా వీరిద్దరి కాంబో మూవీ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎంత గొప్పగా సినిమా తీసినా కూడా ఆ అంచనాలు అందుకోవడం కాస్త కష్టమే అన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే పవన్ తో మూవీ అంటే త్రివిక్రమ్ కాస్త వెనుకా ముందు ఆలోచిస్తున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా తెర వెనుక మొత్తం నడిపించేది త్రివిక్రమ్ అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ రీమేక్ కు స్వయంగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించవచ్చు. కాని అంచనాలు అమాంతం పెరిగి పోతాయనే ఉద్దేశ్యంతో తాను కాకుండా సాగర్ చంద్ర పేరును దర్శకుడిగా ప్రకటించాడు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు మరియు స్క్రీన్ ప్లే పూర్తిగా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న కారణంగానే పవన్ ఈ రీమేక్ కు ఓకే చెప్పాడనే వార్తలు కూడా వినిపించాయి. పవన్ తో ఈ రీమేక్ ను త్రివిక్రమ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటిస్తే అంచనాలు అమాంతం పెరిగి అజ్ఞాత వాసి పరిస్థితి వస్తుందేమో అని త్రివిక్రమ్ ఈ రీమేక్ కు తెర వెనుకే ఉండి పోయాడు అంటున్నారు.