Begin typing your search above and press return to search.

'సీటీమార్‌' రిలీజ్ ఆలస్యంకు అసలు కారణం ఇదేనట

By:  Tupaki Desk   |   28 March 2021 8:30 AM GMT
సీటీమార్‌ రిలీజ్ ఆలస్యంకు అసలు కారణం ఇదేనట
X
గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్‌ గా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న సిటీమార్‌ సినిమాను ముందు నుండి అనుకుంటున్నట్లుగా ఏప్రిల్‌ 2న విడుదల చేయాల్సి ఉన్నా కూడా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఏప్రిల్‌ 2న నాగార్జున వైల్డ్‌ డాగ్‌ సినిమా ఉన్న కారణంగా సిటీమార్‌ ను వాయిదా వేశారు అనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదట. ముఖ్యంగా కబట్టి మ్యాచ్‌ లకు సంబంధించిన సీన్స్ లో వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ఎక్కువగా ఉన్నాయట. వాటికి సంబంధించిన వర్క్‌ పెడ్డింగ్ ఉండటం వల్లే విడుదల వాయిదా వేశారని తెలుస్తోంది.

ఏపీ మరియు తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్ లుగా గోపీచంద్‌ మరియు తమన్నాలు నటించిన విషయం తెల్సిందే. షూటింగ్‌ పూర్తి అయిన ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పెడ్డింగ్‌ కారణంగా వాయిదా పడింది. రాబోయే వారాలు అన్ని కూడా వరుస సినిమాలతో బుక్ అయ్యి ఉన్నాయి. కనుక సిటీమార్‌ ఎప్పుడు వస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గోపీచంద్‌ కు ఈ సినిమా సక్సెస్‌ కీలకం. అలాగే ఇటీవల తమన్నా ఆశించిన స్థాయిలో పెద్ద సక్సెస్ లను దక్కించుకోలేక పోతుంది. దాంతో ఆమెకు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది.