Begin typing your search above and press return to search.

గ‌ల్లా వారి డెబ్యూ హీరో ప్రీలుక్ ఇదే

By:  Tupaki Desk   |   10 Nov 2019 5:20 AM GMT
గ‌ల్లా వారి డెబ్యూ హీరో ప్రీలుక్ ఇదే
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు.. ఎంపీ గ‌ల్లా జ‌య‌ దేవ్ - ప‌ద్మ దంప‌తుల వార‌సుడు అశోక్ గల్లా సినీ ఎంట్రీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఈ సినిమా ని సూప‌ర్ స్టార్ కృష్ణ‌-గ‌ల్లా అరుణ‌ కుమారి స‌మ‌ర్ప‌ణ‌ లో గ‌ల్లా పద్మావ‌తి నిర్మిస్తున్నారు. అమ‌ర్ రాజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్ రామా నాయుడు స్టూడియోస్ లో పూజా కార్య‌ క్ర‌మాల‌తో సినిమా మొద‌ల‌వుతోంది. ఈ కార్య‌క్ర‌మాని కి ప‌లువురు ముఖ్య అతిధులు హాజ‌ర‌వుతున్నారు.

తాజాగా రిలీజైన ప్రీలుక్ లో గ‌ల్లా వార‌సుడు అశోక్ స్మార్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చాడు. అయితే అత‌డి పాత్ర ఎలా ఉండ‌నుంది? అన్న‌ది ఆరా తీస్తే ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తి తెలిసింది. ఈ సినిమాలో అశోక్ ఒక సినిమా ల‌వ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌ బోతున్నాడ‌ట‌. సినిమాలో సినిమా ల‌వ‌ర్! అంటే ఆస‌క్తి పెంచేదే కానీ.. ఇదే మీ కొత్త పాయింట్ కాదు. శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాని కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డెబ్యూ హీరోని ఎలా చూపించ‌బోతున్నారు? అన్న ఉత్కంఠ నెల‌కంది.

ఇక‌పోతే నేటి ఓపెనింగు కు సూప‌ర్ స్టార్ కృష్ణ - సీనియ‌ర్ న‌రేష్ స‌హా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ స‌భ్యులు హాజ‌రుకానున్నారు. మ‌హేష్ అందుబాటు లో లేర‌ని తెలుస్తోంది. ఇక ఈ వేడుక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ ముఖ్య అతిధిగా ప్రారంభిస్తార‌న్న స‌మాచారం ఉంది. అలాగే ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు ఎటెండ్ కానున్నారు.