Begin typing your search above and press return to search.

నారప్ప ఏంటప్ప ఈ కన్ఫ్యూజన్‌

By:  Tupaki Desk   |   3 Feb 2020 5:07 AM GMT
నారప్ప ఏంటప్ప ఈ కన్ఫ్యూజన్‌
X
తమిళ హిట్‌ మూవీ 'అసురన్‌' చిత్రాన్ని తెలుగులో 'నారప్ప' అనే టైటిల్‌ తో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్‌ ప్రధాన పాత్రలో సురేష్‌ బాబు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు వి క్రియేషన్స్‌ అధినేత కళ్లై పులి ఎస్‌ థాను కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ మొన్నటి వరకు రాయలసీమలో జరిగింది. ఇక తదుపరి షెడ్యూల్‌ కోసం హీరోయిన్‌ తప్పనిసరి అవసరం. అందుకే ప్రస్తుతం హీరోయిన్‌ ను ఫైనల్‌ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి.

పలువురు హీరోయిన్స్‌ పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. చివరగా అమలా పాల్‌ ను హీరోయిన్‌ గా ఫిక్స్‌ చేశారట. కాని చివరి నిమిషంలో ఆమె స్థానంలో బిగిల్‌ ఫేం రెబ్బా మోనికా జాన్‌ ను ఎంపిక చేసినట్లుగా కొత్తగా పుకార్లు పుట్టుకు వచ్చాయి. బిగిల్‌ చిత్రంలో ఈమె యాసిడ్‌ దాడి బాదితురాలిగా నటించింది. ఆ సినిమాలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అమలా పాల్‌ మరియు రెబ్బా మోనికాల మద్య నారప్ప హీరోయిన్‌ ఆఫర్‌ దోబూచులాడుతున్నట్లుగా తెలుస్తుంది.

నారప్ప సినిమాలో వెంకీ రెండు విభిన్నమైన గెటప్స్‌ లో కనిపించబోతున్నాడు. అందుకు అమలా పాల్‌ కంటే రెబ్బా మోనికా బాగుంటుందని.. వెంకటేష్‌ మేకప్‌ కు తగ్గట్లుగా ఆమె కూడా మారిపోతుందంటూ మేకర్స్‌ భావిస్తున్నారట. కాని ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్స్‌ లో ఏ ఒక్కరిని కూడా ఓకే చేయలేదు. వీరిద్దరిలో ఎవరిని ఓకే చేసేది ఇంకా క్లారిటీ ఇవ్వక పోవడంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. త్వరగా క్లారిటీ ఇవ్వు నారప్ప అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.