Begin typing your search above and press return to search.

కోవిడ్ + ప్లాప్స్ తెచ్చిన మార్పు ఇది!

By:  Tupaki Desk   |   29 Sep 2022 11:35 AM GMT
కోవిడ్ + ప్లాప్స్ తెచ్చిన మార్పు ఇది!
X
బాలీవుడ్ విజ‌యాలు లేక వెల‌వెల బోతున్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి హిందీ ప‌రిశ్ర‌మ‌కి స‌రైన స‌క్సెస్ ఒక్క‌టీ లేదు. రెండు...మూడు చిన్న సినిమాలు మిన‌హా బాక్సాఫీస్ షేక్ అయ్యే చిత్రం ఒక్క‌టీ లేదు. భారీ అంచ‌నాల మ‌ద్య విడుద‌లైన అగ్ర హీరోల సినిమాల‌న్ని డిజాస్ట‌ర్ల‌గా తేలాయి. వంద‌ల కోట్లు న‌ష్టాలు భ‌రించాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన 'బ్ర‌హ్మాస్ర్త' కేవ‌లం ఓపెనింగ్స్ తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

400 కోట్లు పెడితే 200 కోట్లు రిట‌ర్న్ మాత్ర‌మే వ‌చ్చింది. ఇలా ఎంత కాల‌మో తెలియ‌దు. భ‌విష్య‌త్ లో వ‌చ్చే సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి గానీ...హిట్ అయ్యే వ‌ర‌కూ వాటిలో స్ట‌ప్ ఎంత‌న్న‌ది? చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇలా ర‌క‌ర‌కాల డైమెన్ష‌న్ లో బాలీవుడ్ ఉంది. ఎంత‌లా ప్లాన్ చేసినా ఎక్క‌డో ఓచోట బెడిసి కొడుతుంది. ఆ ర‌కంగా బాలీవుడ్ ప‌రిశ్ర‌మ తీవ్ర న‌ష్టాల్లో క‌నిపిస్తుంది.

ఆ న‌ష్టాలు భ‌ర్తీ కావాలంటే? విజ‌యాలు ఒక్క‌టే మార్గం. మ‌ళ్లీ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడ‌లంటే స‌క్సెస్ ఒక్క‌టే దారి. అయితే ప్ర‌త్యామ్నాయంగా మ‌రొక‌టి కూడా చేయోచ్చ‌ని ప‌లువురు బాలీవుడ్ హీరోలు పారితోషికం త‌గ్గించుకోవ‌డానికి స్వ‌చ్ఛందంగానే ముందుకొస్తున్నారు. ఈ ర‌కంగా నిర్మాణ ప‌రంగా భారం కాకుండా నిలుస్తున్నారు.

అక్ష‌య్ కుమార్..జాన్ అబ్ర‌హం.. షాహిద్ క‌పూర్..రాజ్ కుమార్ రావు లాంటి ఇప్ప‌టికే త‌మ పారితోష‌కాన్ని స‌గానికి తగ్గించుకున్న‌ట్లు తెలుస్తోంది. నిర్మాత‌ల ప‌రిస్థితుల్ని అర్ధం చేసుకుని స‌ద‌రు హీరోలు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో హిందీ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా కూడా ముందుకొచ్చాడు.

ప్ర‌స్తుతం ఆయ‌న ఒక్కో సినిమాకు 25 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ఇప్పుడా పారితోషికంలో భారీ మార్పులు చేసాడు. దాదాపు ప‌ది కోట్లు త‌గ్గించు కుని 15 కోట్ల‌గా ఫిక్స్ చేసాడు. ప్ర‌స్తుతం ఆయుష్మాన్ ఖ‌రానా డ్రీమ్ గ‌ర్ల్ -2 లో న‌టిస్తున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కోత ప‌డిన‌ట్లు స‌మాచారం.

ఇంకా ఆయ‌న చేతిలో కొన్ని సినిమాలున్నాయి. వాటికి కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు. బ్యాలెన్స్ అమౌంట్ త‌గ్గించుకుని తీసుకుంటాన‌ని నిర్మాత‌ల‌కు ముందొస్తుగానే మాటిచ్చిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి కోవిడ్+ ప్లాప్ లు తెచ్చిన మార్పుగానే చెప్పాలి. ఇటీవ‌లే టాలీవుడ్ లో హీరోలు కూడా భారీగా పారితోషికాలు త‌గ్గించుకున్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌కు అధిక పారితోషికాలు భారం కావ‌డంతో బంద్ ప్ర‌క‌టించ‌డంతో హీరోలు దారిలోకి వ‌చ్చారు. బాలీవుడ్ అంత దూరం వెళ్ల‌కుండానే హీరోలు ముందుగానే క‌త్తెర వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.