Begin typing your search above and press return to search.

హిందీ `అల వైకుంఠ‌పుర‌ములో` ఇదీ సంగ‌తి

By:  Tupaki Desk   |   13 Jun 2021 7:30 AM GMT
హిందీ `అల వైకుంఠ‌పుర‌ములో` ఇదీ సంగ‌తి
X
2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో` ప్ర‌కంప‌నాలు ఏడాది అయినా ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ సినిమా మ్యూజిక‌ల్ చార్ట్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో ఇందులోంచి చాలా ట్యూన్లు నిరంత‌రం యువ‌త‌రంతో క‌నెక్ట్ అయ్యి వినిపిస్తూనే ఉన్నాయి.

అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటకు ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌లోనూ ఇమేజ్ పెంచిన చిత్ర‌మిది. `అల వైకుంతపురములో` టాలీవుడ్ లోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ రిలీజై విజయవంతమైంది. త్రివిక్రమ్ మార్క్ ఫ‌న్ రొమాన్స్ ఎంపిక చేసుకున్న పాయింట్ పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుట‌య్యాయి. ఎస్ రాధాకృష్ణ- అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అల వైకుంఠపురములో త్వరలో బాలీవుడ్ లోనూ రీమేక్ కానుంది. కార్తీక్ ఆర్యన్ -కృతి సనోన్ జంట‌గా న‌టిస్తున్నారు. అల్లు అర్జున్- పూజా హెగ్డే పాత్రలను ఈ జోడీ తిరిగి పోషించ‌నున్నారు. ఇటీవల కార్తీక్ ఆర్యన్ ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ హిట్ బుట్ట బొమ్మా పాటకు డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ప్ర‌స్తుతం హిందీ వెర్షన్ ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని అతడు హింట్ ఇచ్చాడు. అల్లు అరవింద్ స్వయంగా హిందీ రీమేక్ ను నిర్మిస్తున్నార‌ని తెలిసింది.