Begin typing your search above and press return to search.

ఓటీటీల వ్యాపార ర‌హ‌స్యం ఇదే...?

By:  Tupaki Desk   |   13 Jun 2020 12:20 PM IST
ఓటీటీల వ్యాపార ర‌హ‌స్యం ఇదే...?
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఏ రేంజ్ లో పడిందో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగులు ఆగిపోయి థియేటర్స్, మల్టీప్లెక్సెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని భావించిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమాలను ఫ్యాన్సీ రేట్స్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలను థియేటర్స్ రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేసారు. ఈ క్రమంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ భారీ పబ్లిసిటీ చేసేస్తున్నాయి. అంతేకాకుండా ఒటీటీల వ్యూయ‌ర్ షిప్ పెరిగిందని.. అంద‌రూ ఓటీటీల‌ను చూసేస్తున్నారని.. క్షేత్ర స్థాయిలో అందరికీ ఓటీటీలు రీచ్ అయిపోయాయని తెగ మార్కెటింగ్ చేస్తున్నాయి. భవిష్యత్ లో ఓటీటీలదే రాజ్యం కాబోతోందని.. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు లేవని.. ఒకవేళ రాబోయే రెండు నెలల్లో థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్‌ కి వస్తారా అనేదీ అనుమానమేనని ప్రొడ్యూసర్స్ ని మభ్యపెడుతున్నారట.

కాగా అత్యంత కీల‌క‌మైన ఇంట‌ర్నెల్ సోర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం అసలు ఓటీటీల వ్యూయ‌ర్ షిప్ పెర‌గ‌ లేదట. అంటే ఓటీటీల‌ను చూసే వారు పెర‌గ‌లేదట. సబ్స్క్రైబర్స్ పెరగలేదట. కాకపోతే ఓటీటీలు చూసే గంట‌లు మాత్రమే పెరిగాయట. అది కూడా క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల జ‌నాలంతా ఇళ్లలోనే ఉంటూ ఖాళీగా ఉన్నారు కాబ‌ట్టి అది సాధ్యమైందట. ఒక్కసారి మ‌ళ్లీ లాక్ డౌన్ ఎత్తేసి సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఓటీటీలు ప‌డిపోయే అవకాశాలున్నాయట. అయితే ఈ లాజిక్ తెలియ‌క‌ నిర్మాత‌లు ఓటీటీలను ఇండ‌స్ట్రీ లోకి ఆహ్వానిస్తున్నారని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ఓటీటీలు ఎక్కువ డ‌బ్బులు ఇచ్చేస్తున్నాయి అని మ‌రో ఫాల్స్ ప్రొప‌గండా చేస్తున్నారట.

నిజానికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ తో ఓటీటీలు డీల్ చేసుకున్నాక‌.. నిర్మాత చేతికి డబ్బులు రావ‌డానికి దాదాపు 8 నెల‌లు టైమ్ ప‌డుతుందట. అయితే ఎలాగైనా సినీ ఇండ‌స్ట్రీని ఆక్యుపై చేయాల‌ని చూస్తున్న ఓటీటీలు మాత్రం ఇక్కడ సినిమాలు రిలీజ్ చేసుకుంటే ప్రొడ్యూసర్స్ కి ఫ్యాన్సీ రేట్స్ వస్తున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారట. నిజానికి ఓటీటీల వ్యాపార ర‌హ‌స్యం ఇదేనట. ఎలాగైనా సినీ ఇండస్ట్రీ లో పాతుకు పోవాలని కార్పోరేట్ కంపెనీలు ప్లాన్స్ చేసుకొని.. వాటిని ఆచరణ లో పెట్టే పని లో పడ్డారట. మరి ఇప్పటికైనా ఓటీటీల నిగూఢ వ్యాపార సూత్రాన్ని సినిమా ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకుంటారేమో అని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.