Begin typing your search above and press return to search.

ఆ హిట్ కాంబినేష‌న్ 11వ సారి!

By:  Tupaki Desk   |   3 Jan 2023 11:30 PM GMT
ఆ హిట్ కాంబినేష‌న్ 11వ సారి!
X
బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్-రొహిత్ శెట్టి కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నార్త్ ఇండ‌స్ర్టీలో భారీ స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ అది. 'జమీన్' నుంచి 'గోల్ మాల్ ఎగైన్' వ‌ర‌కూ స‌క్సెస్ లు త‌ప్ప ఫెయిల్యూర్ అనే టాపిక్ లేదు. 'గోల్ మాల్' బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం. ఆ తర్వాత ఈ సిరీస్ నుంచి 'గోల్ మాల్ రిటర్స్స్'.. 'గోల్ మాల్ 3' కూడా భారీ విజ‌యాలు అందుకున్నాయి.

'గోల్ మాల్' సిరీస్ లానే' సింగం' సిరీస్ కూడా అదే రేంజ్ లో బాక్సాఫీస్ ని దున్నేస్తుంది. 'సింగం రిట‌ర్న్స్' మంచి వసూళ్ల‌ని సాధించింది. ఇప్పుడు 'సింగం ఎగైన్' అంటూ 'గోల్ మాల్' త‌రహాలోనే ప్రాంజైనీ రిపీట్ చేస్తున్నారు. ఇంకా 'ఆల్ ది బెస్ట్'.. 'సండే'.. 'బోల్ బచ్చన్' సినిమాలొచ్చాయి. కానీ ఈ సినిమాలు యావ‌రేజ్ గా ఆడాయి.

మొత్తంగా రోహిత్ తో అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా ప‌ది సినిమాలు పూర్తి చేసారు. తాజాగా 11వ సినిమాకి రంగం సిద్దం చేస్తున్నారు. 11వ చిత్రంగా 'సింగం ఎగైన్' ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని అజ‌య్ దేవ‌గ‌ణ్ రివీల్ చేసారు. ప‌ది సినిమాల జ‌ర్నీని గుర్తు చేసుకుని రోహిత్ త‌న కెరీర్ లో ఎంత ముఖ్య‌మ‌న్న‌ది చెప్ప‌క‌నే చెప్పారు.

ఇలా ఓ ద‌ర్శ‌కుడితో 10 సినిమాలు చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో అండ్ స్టాండింగ్ ..క‌మిట్ మెంట్ ఉంటే త‌ప్ప సాధ్యం కాదు. అందుకే ఈ కాంబినేష‌న్ ఇంత స‌క్సెస్ ఫుల్ గా క‌నిపిస్తుంది. క్రియేటివ్ ప‌రంగా ఎలాంటి డిఫ‌రెన్సెస్ త‌లెత్త‌కుండా బ్యాలెన్స్ గా ముందుకెళ్తున్నారు. ఇంకా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇత‌ర హీరోల చిత్రాల్లోనూ అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. 'సింబా'..'సూర్యవంశీ'..'స‌ర్క‌ర్' వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.