Begin typing your search above and press return to search.
నేను పోషించిన అతి సులువైన పాత్ర ఇదే: బాలయ్య
By: Tupaki Desk | 6 Jan 2019 4:01 PM ISTనందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. బాలయ్య స్వయంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన విశేషాలు పంచుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలు అసలు ఈ సినిమా తెరకెక్కించాలనే ఆలోచనకు అంకురార్పణ ఎక్కడ జరిగిందో వెల్లడించారు.
ఎన్టీఆర్ పుట్టి పెరిగిన ఊరైన నిమ్మకూరులో బసవతారకం హాస్పిటల్ ను ప్రారంభించడానికి బాలయ్య నిమ్మకూరు వెళ్ళినప్పుడు అనుకోకుండా నాన్నగారి సినిమా చేయాలనుందని ప్రకటించారట. అంతే కాదు.. ఆ సినిమాను నిర్మించాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నారట. ఆ తర్వాత అన్ని కలిసి వచ్చాయని.. సినిమా తెరక్కిందని వెల్లడించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచన రావడం స్థలమహిమేమో అని అభిప్రాయపడ్డారు.
నాన్నగారి పాత్రలో నటించేందుకు.. ఇమిటేట్ చేసేందుకు ఎలాంటి హోమ్ వర్క్ చేయలేదని..నిజానికి తన కెరీర్లో తను పోషించిన అతి సులువైన పాత్ర ఇదేనని అన్నాడు. ఈ సినిమాను లాభనష్టాలు బేరీజు వేసుకొని నిర్మించలేదని.. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతవరకూ ఈ సినిమా నిలిచిపోవాలనే ఆలోచనతోనే ఈ సినిమాను తెరకెక్కించామని తెలిపాడు. తెలుగు భాష పై పట్టు ఉంది కదా అని అనవసరంగా 'బొబ్బిలి పులి'.. 'దాన వీర శూర కర్ణ' లాంటి సినిమాల డైలాగులు బయోపిక్ లో చొప్పించలేదని.. బయోపిక్ కు ఎంత అవసరమో అవి మాత్రమే చూపించామని తెలిపాడు. ప్రతి సీన్ కూడా అర్థవంతంగా ఉండేలా.. నెక్స్ట్ సీన్ తో దానకి లింక్ ఉండేలా జాగ్రత్త పడినట్టు చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ మీద ఇతర బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి కదా అని అడిగితే.. నాన్నగారి పేరును నిలబెట్టాలానే తాము ప్రయత్నం చేస్తున్నామని.. కానీ కొందరు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నేను అలాంటి స్థాయికి దిగజారను అని తేల్చేశాడు.