Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ ప్ర‌పంచ‌వ్యాప్త రిలీజ్ తేదీ ఇదే..!

By:  Tupaki Desk   |   14 Feb 2021 4:00 AM GMT
రాధేశ్యామ్ ప్ర‌పంచ‌వ్యాప్త రిలీజ్ తేదీ ఇదే..!
X
ప్రేమికుల రోజు (ఫిబ్ర‌వ‌రి 14) కానుక‌గా నేడు టీజ‌ర్ ట్రీట్ తో తెర‌పైకి రానున్న రాధేశ్యామ్ రిలీజ్ తేదీ తాజాగా వెల్ల‌డైంది. నిజానికి ఈ సినిమాని వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ విడుద‌ల చేయ‌ర‌న్న పుకార్ ఇంత‌కుముందు షికార్ చేయ‌గా.. అది నిజం కాద‌ని తేలింది.

తాజా స‌మాచారం మేర‌కు 2021 జూలై 30న‌ రాధేశ్యామ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆ మేర‌కు మేక‌ర్స్ స‌న్నిహితుల నుంచి లీకులు అందాయి. 14ఫిబ్ర‌వ‌రి ల‌వ‌ర్స్ డే కానుక‌గా ప్రేర‌ణ‌తో రాధేశ్యామ్ ల‌వ్ ఎలా ఉందో రివీల్ కానుంది. టీజ‌ర్ ఎలా ఉండ‌బోతోందో అన్న ఎగ్జ‌యిట్ మెంట్ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భాస్ అభిమానుల్లో ఉంది. ఎట్ట‌కేల‌కు రిలీజ్ తేదీ తెలిసిపోయింది కాబ‌ట్టి డార్లింగ్ ఫ్యాన్స్ లో మ‌రింత ఎగ్జ‌యిట్ మెంట్ పెర‌గ‌నుంద‌న్న‌మాట‌.

ఈ సినిమాతో పాటు బ్యాక్ టు బ్యాక్ మ‌రో మూడు సినిమాల‌కు ప్ర‌భాస్ కాల్షీట్లు ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ ఊవీ.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తో సలార్.. అలాగే ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి ఇవ‌న్నీ బ్యాక్ టు బ్యాక్ డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ ని అల‌రించ‌నున్నాయి.