Begin typing your search above and press return to search.

ఇది కేవలం ఒక్క బాక్సర్ కథ కాదు: గని మేకర్స్

By:  Tupaki Desk   |   26 Jan 2021 10:30 AM GMT
ఇది కేవలం ఒక్క బాక్సర్ కథ కాదు: గని మేకర్స్
X
మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాతో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా డెబ్యూ అవుతున్నాడు. ఇంతకుముందు అంతరిక్షం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్.. గని సినిమాతో మంచి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథను రెడీ చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్టోరీ కాబట్టి వరుణ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. అన్నివిధాలా అంటే శారీరకంగా బాక్సర్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడట. అల్లు బాబీ, ముద్ద సిద్దులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే తాజా సమాచారం ప్రకారం.. గని సినిమా దేశంలోని బాక్సర్స్ ఎదుర్కొంటున్న పరిస్థితులను, వారి జీవన విధానాలను.. అలాగే బాక్సింగ్ ను నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు లాంటి అంశాలను చూపించబోతున్నారట. అంతేగాక ఎమోషనల్ గా కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు మేకర్స్.

ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుణ్ తేజ్ కెరీర్ పరంగా చాలా స్పీడ్ పెంచేసాడు. అలాగే తన కెరీర్ కి ఉపయోగమయ్యే సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వరుస హిట్లలో ఉన్న మెగాఫ్యామిలీ హీరోలలో వరుణ్ కూడా ఒకరు. ఇక గని సినిమానే కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2019లో విడుదలైన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా రూపొందుతుంది. వెంకటేష్, వరుణ్, తమన్నా, మెహరీన్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్3 ఈసారి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మెగాహీరో వరుణ్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ రోజునే గని సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం గని సినిమా పై మెగా అభిమానులలో అంచనాలు బాగానే నెలకొన్నాయి. చూడాలి మరి బాక్సర్ గా వరుణ్ హిట్ కొడతాడేమో!