Begin typing your search above and press return to search.

ప్రెగ్నెన్సి మీద సామ్ సూపర్ కౌంటర్

By:  Tupaki Desk   |   10 Jun 2019 3:57 PM IST
ప్రెగ్నెన్సి మీద సామ్ సూపర్ కౌంటర్
X
ఏంటో సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ఎంతగా ప్లస్ అవుతుందో అంతగా ఇబ్బందులు కూడా పెడుతుంది. వచ్చే నెల 5న విడుదల కానున్న ఓ బేబీని పురస్కరించుకుంది తన ట్విట్టర్ హ్యాండిల్ ని సమంతా బేబీ అక్కినేనిగా మార్చుకోవడం పెద్ద చర్చకే దారి తీసింది. త్వరలో తల్లి కాబోతోందని అందుకే అలా బేబీ అనే ట్యాగ్ తగిలించుకుందని ఓ అర్థం లేని విశ్లేషణతో కొన్ని మీడియా వర్గాలు వార్తలను ప్రచారం కూడా చేశాయి.

దీంతో ఓ వెబ్ సైట్ లింక్ ని తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్న సామ్ నిజంగా తాను తల్లి అవుతోందా ఒకవేళ ఉంటే తనకు చెప్పమని వ్యంగ్యంగా రీ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. తనకు గర్భం వస్తే తనకు తెలియకుండా మిగిలినవాళ్ళకు ఎలా తెలిసిందన్న రీతిలో ఇలా సెటైర్ వేయడం బాగా పేలింది.

ఇప్పటికే ఇలాంటి అబద్దపు ప్రచారాలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న నేపధ్యంలో సామ్ సరైన సమయంలోనే రెస్పాండ్ అయ్యింది. కెరీర్ బాగా సాగుతూ ఇటు తెలుగు అటు తమిళ్ రెండు బాషల్లోనూ మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో ఇలాంటి రిస్కీ డెసిషన్లు ఎవరూ తీసుకోరు. స్టార్ కపుల్ కాబట్టి చైతు సామ్ ల గురించి ఇలాంటి గాసిప్స్ మాములే కాని ఇలా తలాతోకా లేకుండా స్ప్రెడ్ చేయడం ఏదో ఒక రూపంలో ఖండించాల్సిందే. ఏదో దూకుడుగా కాకుండా హ్యుమరస్ గా సమంతా డీల్ చేసిన తీరు అభిమానుల నుంచి కూడా మన్ననలు అందుకుంటోంది.