Begin typing your search above and press return to search.

అఖిల్ పై కింగ్ నాగార్జున ఫీలింగ్ ఇదీ

By:  Tupaki Desk   |   11 April 2021 3:34 AM GMT
అఖిల్ పై కింగ్ నాగార్జున ఫీలింగ్ ఇదీ
X
అక్కినేని అఖిల్ మూడు సినిమాల జ‌ర్నీ గురించి తెలిసిన‌దే. అత‌డు ఎంత హార్డ్ వ‌ర్క్ చేసినా ప్ర‌తిభ ప‌రంగా నిరూపించుకున్నా ఆశించిన క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. దీంతో అఖిల్ స‌క్సెస్ కోసం కింగ్ నాగార్జున అక్కినేని కుటుంబం స‌హా అక్కినేని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఈసారి అఖిల్ న‌టిస్తున్న నాలుగో సినిమా సెంటిమెంట్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని నాగార్జున‌కు నాలుగో సినిమాతోనే బ్రేక్ వ‌చ్చింద‌ని 4 సెంటిమెంటును అభిమానులు ప్ర‌స్థావిస్తున్నారు.

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్- జీఏ2 బృందాలు అఖిల్ కోసం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` వంట‌కాన్ని విందు భోజ‌నంలా సిద్ధం చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు ఇన్ సైడ్ వినిపిస్తున్నాయి. మ‌రోవైపు అఖిల్ న‌టించే ఐద‌వ సినిమా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. తాజాగా ఏజెంట్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌గా దానికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వస్తోంది.

వైల్డ్ డాగ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాగార్జున తన కుమారుడు అఖిల్ కెరీర్ మ్యాట‌ర్ పైనా స్పందించారు. ఇటీవ‌ల‌ విడుదలైన సురేందర్ రెడ్డి ఏజెంట్ తో నాగ్ చాలా సంతోషంగా ఉన్నార‌ని ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మైంది. అఖిల్ ఈ చిత్రంలో స‌రికొత్త మేకోవ‌ర్లో కనిపిస్తున్నారు. సురేందర్ రెడ్డి తన కొడుకును సాలిడ్ గా ప్రెజెంట్ చేస్తాడ‌న్న న‌మ్మ‌కాన్ని నాగార్జున వ్య‌క్తం చేశారు. అఖిల్ ‌కు ఈ చిత్రంలో బ‌ల‌మైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం నేపథ్యం స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.