Begin typing your search above and press return to search.

'ప్రాజెక్ట్ K' లో లెజండరీ నటుడి గెటప్ ఇదే..!

By:  Tupaki Desk   |   7 Sep 2022 2:30 AM GMT
ప్రాజెక్ట్ K లో లెజండరీ నటుడి గెటప్ ఇదే..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ''ప్రాజెక్ట్ K''. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకునే - దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ లెజండరీ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

‘ప్రాజెక్ట్ కె’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందన్న దానిపై సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బి మాట్లాడుతూ ఈ సినిమాలో తన గెటప్ ఎలా ఉండనుందో రివీల్ చేశారు.

''ఇందులో పెద్ద గడ్డాలు మీసాలతో ఉండే క్యారెక్టర్ లో కనుపిస్తాను. నాకు అసలు గడ్డం ఉన్న క్యారెక్టర్స్ నచ్చవు. కానీ, అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి. తప్పడంలేదు'' అని అమితాబ్ బచ్చన్ తెలిపారు. దీన్ని బట్టి బాలీవుడ్ సూపర్ స్టార్ గెటప్ మరియు లుక్ ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయని అర్థం అవుతోంది.

అమితాబ్ గతంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన 'మనం' సినిమాలో స్పెషల్ అప్పీయరన్స్ ఇచ్చారు. అలానే 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' చిత్రంలో ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే 'ప్రాజెక్ట్ K' చిత్రంలోని మెయిన్ క్యారెక్టర్స్ కు పౌరాణిక పాత్ర‌ల‌ను ఆధారంగా చేసుకుని పేర్లు పెట్టార‌నే ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగా అమితాబ్ బచ్చన్ కు అశ్వ‌థ్థామ పేరు పెట్టారని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో అమితాబ్ కు సంబంధించిన కీలక స‌న్నివేశాల‌ను షూట్ చేసారని తెలుస్తోంది.

కాగా, ''ప్రాజెక్ట్ K'' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత సి. అశ్వినీద‌త్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో ఈ సినిమాని తీస్తున్నారు. ఇది ఎవెంజర్స్ రేంజ్ లో ఉంటుందని నిర్మాత అశ్వినీదత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

చైనా - అమెరికా వంటి ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నామని.. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేస్తామని అశ్వినీదత్ తెలిపారు. 2024 దసరా కానుకగా అక్టోబర్ 24న లేదా సంక్రాంతి సందర్భంగా 2025 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అగ్ర నిర్మాత వెల్లడించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.