Begin typing your search above and press return to search.

భోళా శంకర్ ప్లానింగ్ ఇదే!

By:  Tupaki Desk   |   2 Nov 2021 4:30 PM GMT
భోళా శంకర్ ప్లానింగ్ ఇదే!
X
మెగా స్టార్‌ చిరంజీవి 'భోళా శంకర్‌' సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చిన విషయం తెల్సిందే. భోళా శంకర్‌ షూటింగ్ ను లాంచనంగా ఈనెల 11 న లాంచంగా ప్రారంభించబోతున్న విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో మేకర్స్‌ నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో రెగ్యులర్‌ షూటింగ్ ను ఈనెల 15 నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే సినిమా కోసం ఒక భారీ సెట్టింగ్‌ ను దర్శకుడు మెహర్ రమేష్ వేయిస్తున్నాడు. ఆ సెట్టింగ్‌ లో సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి మరియు కీర్తి సురేష్ ఇంకా ఇతర నటీ నటులపై మొదటి షెడ్యూల్‌ ఉంటుందని సమాచారం అందుతోంది. హీరోయిన్ గా తమన్నా నటించబోతున్న విషయం తెల్సిందే. ఆమె షెడ్యూల్‌ ను జనవరిలో ప్లాన్ చేశారట.

సినిమా చిత్రీకరణ కు ఎక్కువ సమయం తీసుకోకుండా మొత్తం 40 నుండి 50 వర్కింగ్‌ డేస్ లోనే ముగించేలా ప్లాన్‌ చేయాలని మెహర్‌ రమేష్‌ తో మొదటి నుండి చిరంజీవి చెబుతూ ఉన్నాడట. కాస్త అటు ఇటుగా అన్నే రోజుల్లో సినిమాను ముగించేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న భోళా శంకర్ సినిమా తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వేదాళంకు రీమేక్ అనే విషయం తెల్సిందే. వేదాళం సినిమాలో అజిత్‌ హీరోగా నటించాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వేదాళంను మార్చేసి భోళా శంకర్ సినిమా స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. భోళా శంకర్ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందిస్తుందని.. అలాగే చిరంజీవిని కొత్త గా చూపిస్తుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి మరో వైపు ఆచార్య సినిమాను ముగించి విడుదలకు సిద్దంగా ఉన్నాడు. వచ్చే ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆచార్య తర్వాత గాడ్‌ ఫాదర్ ను చిరంజీవి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. మలయాళ సూపర్‌ హిట్ మూవీ అయిన లూసీఫర్ ను గాడ్‌ ఫాదర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు చిరంజీవి తీసుకు రాబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. గాడ్‌ ఫాదర్‌ సినిమా చిత్రీకరణ కూడా చాలా స్పీడ్ గా ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా సగంకు పైగా పూర్తి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు భోళా శంకర్ ను పట్టాలెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది చిరంజీవి మూడు సినిమా లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేయనున్నాయి. ఇక బాబీ దర్శకత్వంలో సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించబోతున్నారు. ఆ సినిమా 2023 సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తారట.