Begin typing your search above and press return to search.

హౌస్ ఆఫ్ ది డ్రాగన్ పై ఒరిజిన‌ల్ టాక్ ఇదీ

By:  Tupaki Desk   |   23 Aug 2022 3:46 AM GMT
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ పై ఒరిజిన‌ల్ టాక్ ఇదీ
X
పాపుల‌ర్ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెలీకాస్ట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. గత సీజన్ కొంత నిరాశపరిచినా కానీ ఎనిమిది సీజ‌న్ లు దిగ్విజ‌యంగా కొన‌సాగాయి. ప్ర‌జ‌లు దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ సిరీస్ ని ఆద‌రించారు. తాజాగా ప్రీక్వెల్ వెర్షన్ 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సీజ‌న్ తొలి ఎపిసోడ్ సోమవారం ఉదయం భారతదేశంలో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ప్రదర్శిత‌మైంది.

'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' S01 E01 అనేది GOT నుండి వచ్చిన సూపర్ హైప్ టార్గ‌ర్ యెన్ ఫ్యామిలీ లైఫ్ పై స్టోరి. మునుపటి సిరీస్ తో పోలిస్తే 172 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల గురించిన క‌థాంశంతో ర‌న్ అవుతుంది. మొదటి ఎపిసోడ్ కింగ్ విసెరీస్ తన పెద్ద కుమార్తె .. క్రూరమైన సోదరుడి మధ్య తన వారసుడిని సింహాసనానికి ఎంచుకోవడం గురించి తెర‌కెక్కింది. అతని భార్య చనిపోయిన మగ శిశువును ప్రసవించడంతో అలా జ‌రుగుతుంది.

ఈ దృశ్యం EP01లో చాలా భయంకరంగా ఆవిష్క‌రించారు. ఈ ప్రక్రియలో ఆమె తన ప్రాణాలను పోగొట్టుకోవడంతో అతను తన సోదరుడు ప్రిన్స్ డామియన్ టార్గారియన్ (మాట్) కంటే తన పెద్ద కుమార్తె రెనిరా టార్గారియన్ (మిల్లీ ఆల్కాక్ పోషించిన పాత్ర)ను ఎంచుకున్నాడు. మిల్లీ - మాట్ ఇద్దరూ తమ పనితీరుతో అద్భుతంగా ఆక‌ట్టుకున్నారు.

ఈ షో EP01లో ఇది మరింత ఆసక్తికరం. అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మొత్తం షాక్ లిచ్చే టాపిక్ లేవీ లేవు. GOT మొట్టమొదటి ఎపిసోడ్ జేమీ - సెర్సీ లన్నిస్టర్- బ్రాన్ స్టార్క్ ల‌ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న తర్వాత ఒక భవనం పై నుండి బ్రాన్ స్టార్క్ ను నెట్టేయ‌డంతో క‌థ‌ ముగుస్తుంది. అలాంటి దిగ్భ్రాంతికరమైన ఎలివేష‌న్ లు హౌస్ ఆఫ్ డ్రాగ‌న్స్ లో ఇప్పటివరకు లేవు. అయితే ఎపిసోడ్ 1 చివరి వరకు ఆసక్తికరంగా సాగింది.