Begin typing your search above and press return to search.

ఇది కూడా మెగా రికార్డే మరి... ?

By:  Tupaki Desk   |   10 Nov 2021 2:30 AM GMT
ఇది కూడా మెగా రికార్డే మరి... ?
X
ఎక్కడా లేని చాలా రికార్డులు ఒక్క టాలీవుడ్ లోనే ఉంటాయి. దానికి కారణం ఇక్కడ హీరోల కెరీర్ లాంగివిటీ ఎక్కువ. అరవైలు దాటినా ఇంకా హీరోలుగానే కొనసాగుతారు. గత కొన్ని తరాలుగా ఇది జరుగుతోంది. దాంతో ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్లు తండ్రుల సరసన నటించి కొడుకుల పక్కన నటించిన రికార్డు ఉంది. ఇపుడు రివర్స్ లో కధ సాగుతోంది. కొడుకుల పక్కన నటించిన హీరోయిన్లతో తండ్రులు నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలో కాజల్ ని ఎంచుకున్నారు. అప్పటికే ఆమె చరణ్ తో మగధీరా, గోవిందుడు అందరి వాడే లాంటి సినిమాలు చేసింది. ఆచార్యలో కూడా అదే కాంబో రిపీట్ అయింది.

ఇపుడు తమన్నా వంతు. ఈ సీనియర్ హీరోయిన్ కూడా రామ్ చరణ్ పక్కన నటించింది. బోళా శంకర్ మూవీలో ఆమెను చిరుకు జంతగా ఎంచుకున్నారు. ఇక దీనికి ముందే సైరా మూవీలో కూడా తమన్నా కనిపించినా చిరుతో ఆడిపాడలేదు. ఈ లోటు బోళా శంకర్ తో సూపర్ స్టెప్స్ వేయనుంది. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ని మెహర్ రమేష్ ఎలా పండిస్తారో చూడాల్సిందే. తమన్నా మంచి డ్యాన్సర్. దాంతో చిరుతో జంట కడితే ఎలా ఉంటుంది అన్న క్యూరియాసిటీ అయితే ఫ్యాన్స్ తో బాగా ఉంది.

మరో వైపు వాల్తేర్ వాసు మూవీలో శృతిహాసన్ హీరోయిన్ అని ప్రచారం ఉంది. ఈ ముద్దుగుమ్మ కూడా రామ్ చరణ్ పక్కన మెరిసిన హీరోయినే. రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెగా స్టార్ తో నటిస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా లిస్ట్ ని కనుక చూస్తే కొడుకు చరణ్ తో చేసిన హీరోయిందరితోనూ మెగాస్టార్ వరసబెట్టి చేసేలాగానే ఉన్నారు. ఏది ఏమైనా ఈ రికార్డు మరెవరికీ రాదేమో. ఇప్పటికే నాగార్జున కొడుకు నాగ చైతన్యతో నటించిన రకుల్ తో చేసినా అక్కడితో ఆగిపోయింది. మెగాస్టార్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు అంటే ఇది సరికొత్త సంచలనమే.