Begin typing your search above and press return to search.
చై - సామ్ లకు ప్రత్యేకమైన రోజు ఇది
By: Tupaki Desk | 6 Oct 2021 11:00 AM ISTటాలీవుడ్ యువ జంట అక్కినేని నాగచైతన్య - సమంత విడిపోతున్నామంటూ ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీరు విడిపోతున్నారంటూ వరుస కథనాలు వినిపించాయి. దీనిపై స్పందించిన సమంత అలాంటిది ఏమీ లేదని.. తాను హైదరాబాద్ విడిచి ఎక్కడికి వెళ్లడం లేదని.. ఇక్కడే వుంటానని స్పష్టం చేసింది. ఇక ఇటీవల `లవ్‌స్టోరీ` ప్రమోషన్స్ లో భాగంగా మీడియ ఆ ముందుకొచ్చిన నాగచైతన్య కూడా అలాంటిది ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశాడు.
విడాకుల పుకార్లపై స్పందించిన నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇబ్బందికలిగించాయని మాత్రమే వెల్లడించాడే కానీ ఆ వార్తల్లో నిజం లేదని మాత్రం స్పష్టం చేయలేదు. వారం తిరక్కుండానే అందరికి షాకిస్తూ తాము విడిపోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటన రాకుండా వుండే చై - సామ్ ఈ రోజు (అక్టోబర్ 6న) 4వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేవారు. యస్ .. చై - సామ్ ల పెళ్లి రోజు నేడే.
గత ఏడాది ఇదే రోజు వీరు పంచుకున్న మధుర జ్ఞాపకాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2017 అక్టోబర్ 6న గోవాలో చై - సామ్ ల వివాహం జరిగింది. నాలుగేళ్లు తిరక్కుండానే వీరి మజిలీ ముగియడం పలువురిని ఆలోచింపజేస్తోంది. ఇదిలా వుంటే సరిగ్గా ఇదే రోజు అంటే మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సామ్ .. చై కోసం ఓ పోస్ట్ ని షేర్ చేసింది. `నువ్వు నా వాడివి.. నేను నీదానిని` మేము ఏ ద్వారం గుండా వచ్చినా దానిని కలిసే తెరుస్తాం` ఆనందకరమైన వివాహ వార్షకోత్సవ శుభాకాంక్షలు భర్తగారు` అని షేర్ చేసింది సమంత. గత ఏడాది కోవిడ్ కొంత తగ్గుముఖం పట్టిన తరువాత నవంబర్ నెలలో చై పుట్టిన రోజు వేడుకల కోసం చై - సామ్ గోవా వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు. అదే వీరిద్దరు వెళ్లిన చివరి అకేషన్.
గతంలో ఓ మ్యాగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో సమంత తనకు స్థిరపడాలని వుందని.. తనకు ఓ కుటుంబం కావాలని వుందని ఎన్నెన్నో కోరికలని బయట పెట్టింది. ఆ కారణంగానే తాను సినిమాలు అంగీకరించడం లేదని కూడా పరోక్షంగా ప్రకటించింది. శర్వానంద్ తో కలిసి నటించిన `జాను` తరువాత మరే చిత్రాన్ని అంగీకరించలేదు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ `ఫ్యామిలీ మ్యాన్ 2`లో నటించింది. ఇక్కడి నుంచే అసలు వివాదం మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వెబ్ సిరీస్ లోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అసలు వివాదం మొదలైందని, ..అలాగే వ్యక్తిగత స్టైలిస్ట్ తో కలిసి గోవాలో పంచుకున్న ఫొటోలు కూడా మరో కారణంగా నిలిచాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ప్రచారానికి సమంత వ్యక్తిగత స్టైలిస్ట్ ఇన్ స్టాలో పెడుతున్న పోస్ట్ లు మరింత ఆజ్యాన్ని పోస్తున్నాయి. పెద్ద పెద్ద కుటుంబాల్లో చాలా విషయాలు బయటికి రావని.. తమ ఇళ్లలో వున్న మగవాళ్ల స్వభావాన్ని ఏ కుటుంబమైతే దాచిపెడుతుందో.. వాళ్లే మహిళల హింసకు కారమౌతారని ఆర్టం అయి కానట్టుగా పోస్ట్ పెట్టడంతో సమంత విడాకుల పర్వం వెనక బయటికి రాని సీక్రెట్ ఏదో దాగి వుందనే అనుమానాలకు తావిస్తోంది.
అయితే సమంత మాత్రం ఈ పోస్ట్ లపై స్పందించడం లేదు. తాను కూడా ఇదే తరహా అర్థం వచ్చేలా తనకు ద్రోహం చేసిన వారు ఏదో ఒకరోజు నాశనం అవుతారంటూ ఇండైరెక్ట్ గా విడాకుల వెనకున్న రహస్యాన్ని.. బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. సామ్ విడాకుల స్టోరీ వెనకున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటీ? ... ఇంతకీ చై - సామ్ మధ్య ఏం జరిగింది? వీరి వివాదం విడాకుల వరకు వెళ్లడం వెనక ఎవరున్నారు? అన్నది ఇప్పుడు టాక్ ఆప్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ తెరకెక్కిస్తున్న `శాకుంతలం` చిత్రంలో నటిస్తోంది.