Begin typing your search above and press return to search.

ఈ హీరో సెకండ్ ఇన్నింగ్‌ మొదలు పెట్టేయవచ్చు

By:  Tupaki Desk   |   19 July 2021 5:00 AM IST
ఈ హీరో సెకండ్ ఇన్నింగ్‌ మొదలు పెట్టేయవచ్చు
X
సిక్స్‌ టీన్స్ మరియు జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలతో పాటు చాలా సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన రోహిత్‌ గుర్తుకు ఉన్నాడట. పైన శ్రీకాంత్‌ పక్కన ఉన్నది రోహితే. చాలా మారిపోయాడు కదా. పర్సనాలిటీ అలాగే ఉన్నా కూడా తెల్ల గడ్డం మరియు బట్టతల వల్ల గుర్తించడం కాస్త కష్టమే. హీరోగా మంచి సినిమాలు చేసిన రోహిత్‌ అనూహ్యంగా తెరమరుగు అయ్యాడు. ఆమద్య బిజినెస్‌ చేసుకుంటూ బిజీగా ఉన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మళ్లీ ఇన్నాళ్లకు సినిమాను చేశాడు. హీరోగా కళాకార్‌ అనే సినిమా ను చేసిన రోహిత్‌ అందులో పోలీస్ గా నటించినట్లుగా పోస్టర్ లను చూస్తుంటే అర్థం అవుతుంది.

చాలా మంది హీరోలు సీనియర్‌ లు అయిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా విలన్‌ గా సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెడుతున్నారు. ఇప్పుడు రోహిత్‌ కు కూడా సెకండ్‌ ఇన్నింగ్స్ కు స్కోప్‌ ఉన్నట్లుగా మీడియా సర్కిల్స్‌ లో చర్చ జరుగుతోంది. హీరోగా ఆయన చాలా సినిమాలే చేశాడు. కాని ఇప్పుడు ఆయన్న హీరోగా జనాలు చూస్తారా.. పట్టించుకుంటారా అంటే అనుమానమే అని.. అందుకే ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్ లో హీరోగా కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు హీరోలు జగపతిబాబు.. శ్రీకాంత్‌ లతో పాటు చాలా మంది హీరోలు సెకండ్‌ ఇన్నింగ్స్ లో విలన్ మరియు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెటిల్‌ అయ్యారు. రోహిత్ లుక్‌ చూస్తుంటే విలన్ పాత్రలకు బాగా సూట్ అవుతాడు అనిపిస్తుందని.. అందుకే ఆయన్ను కొందరు విలన్‌ గా నటించాలంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ సినిమా ఫలితాన్ని బట్టి ఆయన తదుపరి నిర్ణయం ఉండే అవకాశం ఉంది. శ్రీకాంత్‌ చేతుల మీదుగా ఫస్ట్‌ లుక్ విడుదల అయిన కళాకార్‌ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అసలు ఎప్పటికి థియేటర్ లో వస్తుందో ఈ సినిమా పై క్లారిటీ లేదు.