Begin typing your search above and press return to search.

ఈ వారం ఎలా ఉంటుందో

By:  Tupaki Desk   |   3 July 2019 5:31 AM GMT
ఈ వారం ఎలా ఉంటుందో
X
చూస్తుంటే టాలీవుడ్ లో ఇకపై ప్రతి శుక్రవారం కనీసం మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. గత నెలన్నరగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సక్సెస్ సాదిస్తున్నవి కొన్నే అయినప్పటికీ నిర్మాతలు మాత్రం పోటీ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడు మరో ఫ్రైడే కూడా వార్ కు సిద్ధమవుతోంది.

అందులో మొదటిది సమంతా ఓ బేబీ. ఇప్పటికే ప్రమోషన్ విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్న బేబీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ కు వచ్చిన స్పందన చూసి మంచి ఓపెనింగ్స్ ఆశిస్తున్నారు నిర్మాతలు. కేవలం సామ్ బ్రాండ్ మీదే దీని మార్కెటింగ్ జరుగుతోంది.

ఇక గత వారమే రాక వాయిదా పడిన ఆది సాయి కుమార్ బుర్రకథ ఇప్పటికి సెట్ అయ్యింది. డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన ఈ మూవీ ఎంటర్ టైన్మెంట్ లవర్స్ ని టార్గెట్ చేసుకుంది. ఇక రియల్ స్టార్ శ్రీహరి వారసుడు మేఘంష్ హీరోగా పరిచయమవుతున్న రాజ్ దూత్ కూడా బరిలో ఉంది. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. టాక్ బాగుంటే సేఫ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.

ఈ మూడు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కాగా హాలీవుడ్ క్రేజీ మూవీ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రొం హోమ్ ఒక రోజు ముందే అంటే రేపే రిలీజ్ అవుతోంది. మల్టీ ప్లెక్సులు దీన్నే ఎక్కువగా నమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలో పోటీ ఆసక్తికరంగా మారింది. గత వారం వచ్చిన బ్రోచెవారెవరురా సెకండ్ వీక్ కంటిన్యూ అవుతుండగా కల్కి చాలా కష్టంగా ఈదుతున్నాడు. మూడో వారంలో అడుగుపెడుతున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా డీసెంట్ గానే కొనసాగుతున్నాడు. సో ఇప్పుడు రాబోయే సినిమాల ఫలితాల ఎలా ఉంటాయా అన్న ఆసక్తి ట్రేడ్ లో మొదలైంది.