Begin typing your search above and press return to search.

ఈ డైరెక్టర్ డైరెక్షన్ కంటే యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   15 July 2022 2:30 PM GMT
ఈ డైరెక్టర్ డైరెక్షన్ కంటే యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడు
X
సినిమా రంగంలో దర్శకులు నటులుగా మారితే మాత్రం తప్పకుండా వారికి మంచి కెరీర్ ఉంటుంది అని కొంతమంది దర్శకులు ఉదాహరణగా నిలుస్తున్నారు. ఒక దర్శకుడు ఆలోచన విధానం మరో దర్శకుడుకి అర్థం అవుతుంది అని అనుకున్నప్పుడు కొంతమంది ఒరిజినల్ దర్శకులను నటులుగా మార్చేస్తున్నారు. ఇక ఆ విధంగా ప్రస్తుతం సముద్రఖని యాక్టర్ గా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే అదే తరహాలో గౌతమ్ వాసుదేవన్ కూడా నటుడిగా ఎక్కువసార్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దర్శకుడు పేరు వినగానే అందరికీ కూడా కొన్ని లవ్లీ రొమాంటిక్ సినిమాలతో పాటు డిఫరెంట్ యాక్షన్ సినిమాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగులో అయితే అతను ఏ మాయ చేసావే సినిమాతో పాటు ఘర్షణ సినిమాతో కూడా మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు.

గౌతమ్ వాసుదేవ్ ఒక ప్రేమ కథను తెరపైకి తీసుకువచ్చాడు అంటే తప్పకుండా ఆ సినిమా ఓ వర్గం ఆడియన్స్ కు అయితే ఎంతగానో నచ్చుతుంది. అయితే ఆయన ఇటీవల కాలంలో మాత్రం డైరెక్టర్ గా కంటే నటుడుగానే కాస్త ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఆ మధ్యకాలంలో తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో ఆయనకు ఒరిజినల్ పాత్రని ఇచ్చారు. అంతకంటే ముందే గౌతమ్ వాసుదేవన్ చాలావరకు తమిళ సినిమాల్లో నటించాడు. తన సినిమాల్లో కాకుండా మిగతా డైరెక్టర్ల కోరిక మేరకే ఇతర వినిమాల్లో ఎక్కువగా నటించేవారు.

ఇక ప్రస్తుతం ఆయన సీతారామం సినిమాల్లో కూడా మేజర్ సెల్వన్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా మరొక ముఖ్యమైన పాత్రలో సుమంత్ కూడా నటిస్తున్నాడు.

ఇక ఇప్పుడు గౌతమ్ వాసుదేవన్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా కూడా గౌతమ్ వాసుదేవ్ ఇటీవల కాలంలో దర్శకుడిగా కంటే నటుడుగానే ఎక్కువగా కనిపిస్తున్నాడు మరి ఈ పాత్ర ద్వారా ఆయనకు ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో చూడాలి.