Begin typing your search above and press return to search.

60 కాల్ షీట్స్...ఈ కమెడియన్ డిమాండ్ మాములుగా లేదే

By:  Tupaki Desk   |   19 Jan 2023 2:30 AM GMT
60 కాల్ షీట్స్...ఈ కమెడియన్ డిమాండ్ మాములుగా లేదే
X
సంక్రాంతికి అజిత్ కుమార్ తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 11వ తేదీన ఈ సినిమా తెలుగు సహా మిగతా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే 200 కోట్ల మార్క్ దాటేసి మరిన్నీ వసూళ్ల దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. ఈ సినిమా తరువాత అజిత్ కుమార్ విగ్నేష్ శివ దర్శకత్వంలో తన 62వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది.

అదేమిటంటే ఈ సినిమాలో అరవిందస్వామి, అలాగే కమెడియన్ సంతానం కూడా కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ గా ఐశ్వర్య రాయిని తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా.. ఆ విషయం మీద అధికారిక ప్రకటన వెలబడాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ఏమిటంటే... ఈ సినిమాలో నటించేందుకు సంతానం 60 కాల్ షీట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దానికి తగినట్లుగానే ఆయన రెమ్యూనరేషన్ భారీగా చార్జ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం ఆయన తీసుకున్న రెమినరేషన్ కంటే డబుల్ రెమ్యూనరేషన్ అడుగుతున్నాడని... దాదాపుగా ఆయన రెమ్యూనరేషన్ దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు అవుతుందని తెలుస్తోంది. కమెడియన్ గా అనేక సినిమాల్లో అలరించిన సంతానం తర్వాత హీరోగా కూడా మారాడు. మీ సినిమా చేయాలంటే నేను హీరోగా చేస్తున్న సినిమాలకు గ్యాప్ ఇవ్వాలి కాబట్టి... తాను అడిగిన రెమ్యూనరేషన్ ఇస్తే తప్ప మీ సినిమా చేయలేనని ఆయన ఏకే 62 మేకర్స్ కి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ముంబై బాక్ డ్రాప్ లో తెరకెక్కి అవకాశం ఉందని తర్మిల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జనవరి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సంతానం సినిమాకి ఎనిమిది కోట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు తమిళ సినీ వర్గాలలో చర్చనీయాంశమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.