Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఈ క్లీవేజ్ షో అదుర్స్!

By:  Tupaki Desk   |   7 April 2020 3:30 AM GMT
ఫోటో స్టోరీ: ఈ క్లీవేజ్ షో అదుర్స్!
X
కేరళ భామ మాళవిక మోహనన్ ఇంకా తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించలేదు. ఎందుకంటే ఇంకా ఈ భామ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. విజయ్ దేవరకొండ 'హీరో' తో ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా కాస్తా అటకెక్కడం తో తెలుగు ప్రేక్షకులకు ఈ భామ టాలెంట్ చూసే అవకాశం లభించలేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి మాత్రం ఈ భామ తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మాళవిక పక్కాగా ఈ తరం భామ.

మాళవిక కనుక ఓ హాట్ ఫోటో షూట్ చేసిందంటే సోషల్ మీడియా డిజిటల్ ఉష్ణోగ్రతలు వెంటనే ఓ నాలుగైదు డిగ్రీలు పెరగాల్సిందే. పారాసిట్మాల్ బిళ్ళలకు తగ్గే జఫ్ఫా ఉష్ణోగ్రతలు కాదు. రియల్.. రియలిస్టిక్ టెంపరేచర్స్. అంతగా రియల్ హాట్ నెస్ ఉంటుంది. ఈ భామ కొద్ది రోజుల క్రితం హాజరైన ఓక ఫోటో షూట్ కు సంబంధించిన రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో మాళవిక ఓ బ్లాక్ టాప్.. క్రీమ్ కలర్ బెల్ బాటమ్ ధరించి ఓ అంతర్జాతీయ స్థాయి సూపర్ మోడల్ తరహాలో పోజులిచ్చింది. స్లీవ్ లెస్ టాప్.. పోలవరం డ్యామ్ గేట్లంత పెద్దదిగా ఉన్న వీ-నెక్ కావడం తో అందాల వ్యూ కూడా భారీగానే ఉంది. ఇక ఒత్తుగా దువ్విన జుట్టు.. పర్ఫెక్ట్ మేకప్.. సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ తో టాప్ లీగ్ మోడల్స్ కు కూడా పోటీ ఇచ్చేలా ఉంది.

ఇక మాళవిక సినిమాల విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా 'మాస్టర్' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో మాళవికకు ఇతర స్టార్ హీరోలు కూడా ఆఫర్లు ఇస్తారేమో వేచి చూడాలి.