Begin typing your search above and press return to search.
వింటేజ్ విజువల్ వండర్ గా 'రాధేశ్యామ్'
By: Tupaki Desk | 6 Nov 2020 9:30 AM ISTప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో గత రెండే సంవత్సరాలుగా రూపొందుతున్న 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది. ఎక్కువ శాతం ఈ సినిమా విదేశాల్లో చిత్రీకరించాల్సి వచ్చిన కారణంగా సినిమాకు ఎక్కువ సమయం పట్టిందంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాను 1980 కాలంలోని ప్రేమ కథతో సాగుతుంది. అది కూడా యూరప్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథ అవ్వడంతో అప్పటి పరిస్థితులను అక్కడ క్రియేట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ కాలంలోని పరిస్థితులు మరియు వాతావరణంను రీ క్రియేట్ చేయడంతో పాటు చాలా స్టైలిష్ గా దర్శకుడు రాధాకృష్ణ చూపించబోతున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఒక్కో విషయాన్ని రివీల్ చేస్తూ వస్తున్నారు. గొప్ప కళాకారుడు గీసిన అందమైన పెయింటింగ్ ను చూసినప్పుడు ఎలాంటి అనుభూతి అయితే కలుగుతుందో అలాంటి అనుభూతి ఈ సినిమా చూస్తున్న సమయంలో కలుగుతుంది అంటున్నారు.
మొత్తానికి రాధేశ్యామ్ ఒక విజువల్ వండర్ గా అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో పాటు ఒక చక్కని లొకేషన్స్ ను ప్రేక్షకులకు చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ వింటేజ్ లవ్ స్టోరీని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.