Begin typing your search above and press return to search.

ఏజ్ బార్ అవుతున్నా ఈ బ్యూటీ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదుగా..!

By:  Tupaki Desk   |   13 March 2021 2:30 PM GMT
ఏజ్ బార్ అవుతున్నా ఈ బ్యూటీ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదుగా..!
X
టాలీవుడ్ లో 16 ఏళ్ల క్రితం హీరోయిన్ గా అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఇప్పటికీ ఓవైపు సీనియర్ హీరోలతో మరోవైపు కుర్ర హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇండస్ట్రీలోకి కొత్త కుర్ర హీరోయిన్లకు ఎంతమంది వస్తున్నా తమన్నా జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. పాలరాతి శిల్పం లాంటి తమన్నా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అందంలో ఫిజిక్ లో తనకు తానే పోటీ అని చెప్పడానికి నిన్న విడుదలైన 'సీటీమార్' లోని 'జ్వాలారెడ్డి' సాంగ్ లో తమన్నాని ఉదాహరణగా చెప్పొచ్చు.

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న 'సీటీమార్' సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో 'జ్వాలారెడ్డి' అనే ఊరమాస్ పాటని వదిలారు. ఇందులో త‌మ‌న్నా మెయిన్ హైలెట్ అవడమే కాకుండా.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏజ్ బార్ అవుతున్నా త‌న అందచందాలతో ఫిజిక్ తో కుర్ర‌కారు మ‌న‌సు దోచేస్తానని ఈ పాటతో చెప్పకనే చెప్తోంది. 'రచ్చ' 'బెంగాల్‌ టైగర్‌' చిత్రాల్లో తమన్నాని అందంగా చూపించిన సంపత్‌ నంది.. 'సీటీమార్' లో అత్యద్భుతంగా చూపించారు. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే ఆ క్రెడిట్ లో సింహభాగం మిల్కీ బ్యూటీకి ఇవ్వాల్సిందేనని సినీ జనాలు అంటున్నారు.

ఇకపోతే తమన్నా ప్రస్తుతం టాలెంటెడ్ హీరో సత్యదేవ్ సరసన 'గుర్తుందా శీతాకాలం' అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. దీంతో పాటు యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న 'అంధాదున్' తెలుగు రీమేక్ లో కూడా నటిస్తోంది. ఇందులో తమన్నా ది హీరోయిన్ రోల్ కానప్పటికీ సినిమాలో చాలా కీల‌క‌మైన‌ పాత్ర. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో వస్తున్న 'ఎఫ్-3' సినిమాలో వెంకటేష్ కి జోడీగా మిల్కీ బ్యూటీ నటిస్తోంది.