Begin typing your search above and press return to search.

'పుష్ప'కి ధీటుగా ఆమె క్యారక్టర్ ఉండబోతోందా...?

By:  Tupaki Desk   |   15 April 2020 9:10 AM GMT
పుష్పకి ధీటుగా ఆమె క్యారక్టర్ ఉండబోతోందా...?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ మూవీగా 'పుష్ప‌' తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుకుమార్ ప్రతి సినిమాలో హీరోని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నాడు. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుక్కు మరో ప్రయోగానికి తెరలేపాడని తెలుస్తోంది. రాయలసీమ చిత్తూరు యాస - భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. దీని కోసం బన్నీ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా పొందుతున్నాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ డ్రెస్సింగ్ స్టైల్, గెటప్ చూస్తేంటే 'రంగస్థలం'లో చరణ్ ని పోలివుంది. సో పుష్ప కూడా మరో బ్లాక్ బస్టర్ కాబోతోందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. శేషాచ‌లం అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌ గా క‌నిపించ‌బోతున్నాడని సమాచారం.

ఫస్ట్ లుక్ తో బన్నీ క్యారక్టర్ ఏంటనేది ఒక ఐడియా వచ్చాక.. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక పాత్ర ఏ విధంగా చేయబోతోంది అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ఆమె ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. కాగా రష్మిక క్యారెక్టర్ ఒక పెద్ద ట్విస్ట్ తో స్టోరీలో అడుగుపెడుతుందట. స్టోరీ ముందుకు సాగుతుండగా ఆమె పాత్ర బిహేవియర్ ఆడియన్స్ ని షాక్ గురిచేస్తుందట. ఇదే కనుక నిజమైతే రష్మిక కెరీర్లో గుర్తుండిపోయే క్యారక్టర్ గా ఇది మిగిలిపోనుంది. ఇప్పటి దాకా మోడరన్ గర్ల్ పాత్రలలో నటించిన రష్మికని సుకుమార్ ఒక కొత్త అవతారంలో చూపిస్తాడని అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ - ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.